ట్రైలర్: విశ్వక్ సేన్ ధమ్కీ తో అదరగొట్టేస్తున్నాడుగా..!!

Divya
టాలీవుడ్ లో యంగ్ హీరో విశ్వక్ సేన్ తన దర్శకత్వంలో నటుడు గా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ధమ్కీ. ఈ సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ లభించింది.తాజాగా ఈ సినిమా ట్రైలర్ను కూడా ఆవిష్కరించారు. ఈ సినిమా ట్రైలర్ ని బాలకృష్ణ లాంచ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా చిత్ర బృందానికి సైతం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ డ్యూయల్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ట్రైలర్ కూడా అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తోంది.
ఇక ట్రైలర్ విషయానికి వస్తే ఇందులో విశ్వక్ సేన్ ఒక పాత్ర వెయిటర్ గా కనిపిస్తే మరొక పాత్ర కొన్ని కోట్ల రూపాయలకు వారసుడుగా కనిపిస్తున్నారు. ఇక కొన్ని కోట్ల టర్నోవర్ కంపెనీ కలిగిన ఒక వ్యక్తి ప్రమాదంలో మరణించగా కుటుంబ పెద్ద యొక్క అభ్యర్థనపై ఆ వెయిటర్ ని అతని స్థానంలో ఉంచడం జరుగుతుంది. ఇక ఈ క్రమంలోనే కొంతమంది శత్రువులు హీరో ఫేస్ చేయవలసి వస్తుంది. రెండు విభిన్నమైన క్యారెక్టర్లలో విశ్వక్సేన్ రాసుకోవడమే కాకుండా వాటి మధ్య తేడా కనిపించేలా చాలా జాగ్రత్త పడ్డారని చెప్పవచ్చు.
ఇందులో హీరోయిన్గా నివేదా పేతురాజ్ నటించింది. ఇక వీరిద్దరి మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు యువతను బాగా ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. ట్రైలర్ ని బట్టి చూస్తే ఈ సినిమా స్టోరీ లైన్ రో టీన్ గాని ఉన్నట్లుగా కనిపిస్తోంది. కాకపోతే సరి కొత్త ప్రజెంటేషన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.అంతేకాకుండా ఇందులో ఏదో ఈ ట్రైలర్ ని కట్ చేయడం జరిగింది. ఇందులో రావు రమేష్, రోహిణి ,హైపర్ ఆది ,మహేష్ తదితరులు నటిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమైన పాత్రలో తరుణ్ భాస్కర్ కూడా నటిస్తున్నారు. మరి ఈ చిత్రంతోనైనా విశ్వక్సేన్ ఈసారి సక్సెస్ అవుతారేమో చూడాలి. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో అన్ని భాషలలో ఒకేసారి విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: