సినిమా మొదలుకాకముందే.. అదిరిపోయే బిజినెస్..!!

Divya
స్టార్ హీరోల సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే సినిమా బిజినెస్ బాగా జరుగుతూ ఉంటుంది. ఇదే ఈ సినిమాకు మంచి క్రేజీ తెచ్చిపెడుతుందని చెప్పవచ్చు. లేటెస్ట్గా అలాంటి సూపర్ బిజినెస్ అందుకున్న హీరోలలో విజయ్ దళపతి మూవీ కూడా ఒకటి చెప్పవచ్చు. కోలీవుడ్లో స్టార్ హీరోగా వరస సినిమాలలో బిజీగా ఉన్న విజయ్ ప్రస్తుతం డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వరిసు అనే సినిమాని చేస్తున్నారు విచిత్రం పూర్తి కాగానే విజయ్ 67వ మూవీని డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇక విజయ్తో గతంలో కూడా మాస్టర్ అంటే చిత్రాన్ని తెరకెక్కించారు లోకేష్

ఇక ఆ తర్వాత కమల్ హాసన్ తో కలిసి విక్రమ్ సినిమాని తెరకెక్కించి కమలహాసన్ కెరీర్ కి ఒక మైలురాయిగా నిలిచారు. దీంతో డైరెక్టర్ పేరు కూడా బాగా పాపులర్ అయింది. అలా విజయ దళపతి తో తన 67వ సినిమాని తెరకెక్కించే అవకాశం సంపాదించారు లోకేష్ కనగరాజ్. ఇక ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లకుండానే ఓటీపీ ఆఫర్ భారీ ధరకే వచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రముఖ ఓటీటి ప్లాట్ ఫామ్ అయినా  నెట్ ఫ్లిక్స్ రూ.100 కోట్ల రూపాయల దాకా ఆఫర్ ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

దీంతో విజయ్  అభిమానులు తమ హీరో సినిమాకు ఇంత బిజినెస్ లేకపోతే ఎలా అంటూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక థియేటర్ల బిజినెస్ ఏ రేంజ్ లో ఉంటుందో అంటూ అభిమానులు కామెంట్లు చేస్తూ ఉంటారు. విజయ్ వరీసు చిత్రాన్ని తెలుగులో వారసుడు అనే పేరుతో డైరెక్టుగా విడుదల చేయబోతున్నారు. డైరెక్టర్ లోకేష్ తెరకెక్కించిన ఖైదీ విక్రమ్ వంటి చిత్రాలకు మంచి క్రేజీ వచ్చింది దీంతో ఇప్పుడు విజయ్ సినిమా అని కూడా తెరకెక్కిస్తూ ఉండడంతో తెలుగులో కూడా బిజినెస్ పరంగా బాగానే ఆకట్టుకుంటుందని కోలీవుడ్ మీడియా వర్గాలు తెలుపుతున్నాయి. ప్రస్తుతం విజయ 67వ సినిమా గురించి ఓటీటీ డీల్ క్లోజ్ అయినట్లే అని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: