వంశీ పైడిపల్లి ఆ సినిమా చేసి తప్పు చేశాడా?

P.Nishanth Kumar
తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి తో కలిసి ఓ సినిమా చేసిన విషయం తెలిసిందే. వారసుడు అనే సినిమాను దిల్ రాజు నిర్మాణంలో రూపొందించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తమిళ సినిమాగా రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారని ఇప్పటికే చిత్ర బృందం మెల్లడించింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో ఈ సినిమా యొక్క విడుదల ఇప్పుడు ఎంతో అయోమయంగా ఉంది.

డబ్బింగ్ సినిమాలు పండుగ సీజన్లలో రావడానికి అనుమతి లేని కారణంగా ఈ సినిమా విడుదల తెలుగులో నిలిపివేయబడుతుందా లేదా అన్న అనుమానాలు ఇప్పుడు కలుగుతున్నాయి. వాస్తవానికి ఈ సినిమాపై మొదటి నుంచి అనుమానాలు అందరిలో నెలకొన్నాయి ఎందుకంటే ఒక తెలుగు దర్శకులు నిర్మాతలు ఇద్దరు కలిసి తమిళ్ హీరోతో అన్ని వందల కోట్ల సినిమాను భారీ బడ్జెట్ కారణమేంటో ఎవరికి అర్థం కాలేదు దానికి బదులు తెలుగు సినిమా హీరోతో చేస్తే బాగుండేది అని కొంతమంది సినిమా విశ్లేషకులు చెప్పుకొచ్చారు.

అయితే ఇప్పుడు ఈ సినిమా పూర్తయిన నేపథ్యంలో ఇలాంటి వార్తలు రావడం సహజం అయిపోయింది ఒకవేళ ఈ సినిమాకు ఫ్లాప్ టాక్ వస్తే ఇలాంటి విమర్శలు ఇంకా ఎక్కువ అవుతాయి అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. మరి వీటన్నిటి విమర్శలకు ఈ సినిమా యొక్క విజయం సమాధానం చెప్పి భారీ కలెక్షన్లను తీసుకువస్తుందా అనేది చూడాలి. ఇకపోతే మహర్షి సినిమా తో తెలుగు తో పాటు తమిళంలో కూడా మంచి గుర్తింపు దక్కించుకున్న ఈ దర్శకుడు తమిళ సినిమా చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపించాడు. అయితే ఇది మహేష్ రిజెక్ట్ చేయడంతో విజయ్ కి సినిమా ఒకే అయ్యింది. మరి ఈ సినిమా తో అయన ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: