చైతు సేఫ్ గేమ్.. ఆ సినిమా ఎప్పుడంటే?

P.Nishanth Kumar
అక్కినేని నాగచైతన్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుం ది. వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తొందరలోనే పూర్తి కాబోతుంది అని తెలుస్తుంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి చిత్ర బృం దం సన్నాహాలు చేస్తుంది. తమిళనాడు లో మంచి దర్శకుడిగా వెరైటీ చిత్రాలు చేసే డైరెక్టర్ గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు వెంకట్ ప్రభు.

అలాంటి ఈ దర్శకుడు నుంచి రాబోతున్న తొలి సినిమా కావడం చిత్రంపై ఇంతటి అంచనాలు పెరగడానికి కారణం అవుతుంది. ఆయన ఇటీవలే  చేసిన సినిమా మానాడు భారీ విజయం అందుకోవడంతో ఈ సినిమాపై కూడా మంచి అంచనాలే ఏర్పడ్డాయి. అందులో భాగంగా ఒక వెరైటీ కాన్సెప్ట్ తో సినిమా చేస్తున్న ఈ దర్శ కుడు ఈ సినిమా ద్వారా ఎలాంటి విజయాన్ని అందుకొని తెలుగులో మంచి దర్శకుడిగా ఎదుగుతాడు అనేది చూడాలి.

అయితే నాగచైతన్య ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేయాలి అన్నదానిపై ఎంతో క్లారిటీగా ఉన్నాడట. ఇప్పటిదాకా పలు సినిమాలతో కలిసి తన సినిమాలను విడుదల చేసిన చైతు ఈ సినిమాను సోలోగా విడుదల చేసి విజయాన్ని అందుకోవాలని చూస్తున్నాడట. కలెక్షన్ పరంగా కూడా మెరుగుపడాలి అంటే తప్పకుండా ఈ సినిమాను సోలోగా విడుదల చేయాలని ఆయన భావిస్తున్నాడట. తొందరలోనే ఈ చిత్రం యొక్క విడుదలపై పూర్తి క్లారిటీ రానుంది. ఇక ఈ చిత్రం మంచి విజయం అందుకోవడం మాత్రమే కాదు తప్పకుండ వంద కోట్ల కలెక్షన్స్ అందుకోవాలి అని అయన అభిమానులు కోరుకుంటున్నారు. మరి అంతటి సత్తా ఈ సినిమా కలిగి ఉంటుందా అనేది చూడాలి. ఇప్పటివరకు వచ్చిన అవుట్ పుట్ పట్ల యూనిట్ ఎంతో నమ్మకంగా ఉందని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: