6 రోజుల్లో "యశోద" మూవీ ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్ల వివరాలు ఇవే..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతున్న సమంత తాజాగా యశోద అనే లేడీ ఓరియంటెడ్ మూవీ లో ప్రధానపాత్రలో నటించిన విషయం అందరికీ తెలిసింది. ఈ మూవీ లో ఉన్ని ముకుందన్ , వరలక్ష్మి శరత్ కుమార్ , రావు రమేష్ , మురళి శర్మ ముఖ్యపాత్రలలో నటించగా , మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ మూవీ కి సంగీతం అందించాడు. హరి శంకర్ , హరీష్ నారాయణ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించారు. ఈ మూవీ ని దర్శకులు సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కించారు. ఈ మూవీ విడుదలకు ముందే ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికుల మంచి అంచనాలు పెట్టుకున్నారు.

అలా మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ మూవీ నవంబర్ 11 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా తెలుగు తో పాటు తమిళ్ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో భారీ ఎత్తున విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా డీసెంట్ కలెక్షన్ లు లభిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటివరకు యశోద మూవీ ప్రపంచవ్యాప్తంగా 6 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది.

ఈ 6 రోజుల్లో ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.
నైజాం : 3.30 కోట్లు .
సీడెడ్ : 58 లక్షలు .
యు ఏ : 76 లక్షలు .
ఈస్ట్ : 38 లక్షలు .
వెస్ట్ : 23 లక్షలు .
గుంటూర్ : 42 లక్షలు .
కృష్ణ : 44 లక్షలు .
నెల్లూర్ : 19 లక్షలు.
6 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి యశోద మూవీ 6.30 కోట్ల షేర్ , 11.05 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
తమిళ్ :  85 లక్షలు .
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో :  1.02 కోట్లు .
ఓవర్ సీస్ లో :  2.36 కోట్లు .
6 రోజుల్లో యశోద మూవీ ప్రపంచవ్యాప్తంగా 10.53 కోట్లు షేర్ , 22.45 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: