కాంతార: రిషబ్ శెట్టికి సూపర్ స్టార్ బహుమతి?

Purushottham Vinay
కాంతార: కన్నడ సినిమా 'కాంతార' సినిమా దేశవ్యాప్తంగా ఎంత పెద్ద బ్లాక్  బస్టర్  హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొదట కన్నడలో విడుదలైన ఈ సినిమా.. అక్కడ భారీగా విజయం సాధించడంతో ఆ సినిమాను ఇతర భాషల్లో కూడా విడుదల చేయడం జరిగింది.ఈ సినిమా విడుదలైన అన్ని చోట్లా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో రిషబ్ శెట్టి పేరు దేశవ్యాప్తంగా ఎంతగానో మారుమోగిపోయింది. ఆయన ఈ సినిమాలో హీరోగా నటించడమే కాకుండా రచన, దర్శకత్వం కూడా చేయడం కూడా విశేషం. 'కాంతార' సినిమాపై ఇప్పటికే హీరో ప్రభాస్ ఇంకా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వంటి సినీ ప్రముఖలు ప్రశంసల వర్షం కురిపించారు. ఇప్పుడు తాజాగా రిషబ్ శెట్టి కు తమిళ సూపర్ స్టార్ రజని కాంత్ నుంచి ప్రశంసలు మాత్రమే కాదు ఇంకా ఖరీదైన గిఫ్ట్ కూడా లభించింది.


'కాంతార' సినిమా దేశవ్యాప్తంగా మంచి హిట్ అందుకొని విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న నేపథ్యంలో ఇండియన్ సూపర్ స్టార్ రజనీ కాంత్ రిషబ్ శెట్టి ను అభినందించారు. ఈ సందర్భంగా రిషబ్ ను చెన్నై లోని ఆయన నివాసానికి రజిని ఆహ్వానించారు. రిషబ్ శెట్టిని సత్కరించారు. అంతేకాకుండా ఆయనకు గోల్డ్ చైన్, గోల్డ్ లాకెట్ ను బహుమతిగా అందించారు రజనీకాంత్. కాంతార సినిమా చాలా బాగుందని, చాలా అద్భుతమైన సినిమాను తీసావంటూ రిషబ్ శెట్టిని ప్రశంసించారు. గతంలోనే కాంతార సినిమా చూసిన రజనీ ఆ మూవీ పై ఎన్నో ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా మాస్టర్ పీస్ అని, 50 ఏళ్లకోసారి గానీ ఇలాంటి సినిమాలు రావని, సినిమా తనకు గూస్ బంప్స్ తెప్పించిందని ఆయన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. ఆ తర్వాత రిషబ్ శెట్టిని ఇంటికి ఆహ్వానించి సత్కరించారు రజనీ కాంత్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: