ఆర్మాక్స్ మీడియా సంస్థ నిర్వహించిన సర్వేలో టాప్ పొజిషన్ లో నిలిచిన సమంత..!

Pulgam Srinivas
ఆమాక్స్ మీడియా సంస్థ ఈ మధ్య కాలంలో సినీ తారలపై సర్వేలు నిర్వహిస్తూ వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా తాజాగా ఈ మీడియా సంస్థ అక్టోబర్ నెలకు సంబంధించి తెలుగు మోస్ట్ పాపులర్ ఫిమేల్ స్టార్స్ పేరిట ఒక సర్వేను నిర్వహించింది. ఆ సర్వేలో టాలీవుడ్ ఇండస్ట్రీ లో అత్యద్భుతమైన క్రేజ్ ఉన్న 10 మంది హీరోయిన్ ల పేర్లను ఈ మీడియా సంస్థ తాజాగా ప్రకటించింది. ఈ సర్వే ప్రకారం ఈ 10 స్థానాల్లో ఎవరు ఉన్నారో తెలుసుకుందాం. ఆమాక్స్ మీడియా సంస్థ నిర్వహించిన సర్వేలో టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ ఫిమేల్ యాక్టర్స్ తెలుగు అక్టోబర్ నెలకు సంబంధించిన లిస్ట్ లో సమంత మొదటి స్థానంలో నిలిచింది. తాజాగా సమంత నటించిన యశోద సినిమా థియేటర్ లలో విడుదల అయింది.
 

ఈ మూవీ ప్రస్తుతం విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది. 2 వ స్థానంలో కాజల్ అగర్వాల్ నిలిచింది. కాజల్ అగర్వాల్ ప్రస్తుతం కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇండియన్ 2 మూవీలో నటిస్తోంది. 3 వ స్థానంలో అనుష్క శెట్టి నిలిచింది. 4 వ స్థానంలో సాయి పల్లవి నిలిచింది. 5 వ స్థానంలో పూజా హెగ్డే నిలిచింది. 6 వ స్థానంలో రష్మిక మందన గెలిచింది. 7 వ స్థానంలో కీర్తి సురేష్ నిలిచింది. 8 వ స్థానంలో తమన్నా నిలిచింది. తమన్నా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భోళా శంకర్ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. 9 వ స్థానంలో కృతి శెట్టి నిలిచింది. కృతి శెట్టి ప్రస్తుతం వరుస మూవీ ఆఫర్ లతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. 10 వ స్థానంలో అనుపమ పరమేశ్వరన్ నిలిచింది. అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం 18 పేజెస్ మూవీ లో హీరోయిన్ గా నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: