మేకప్ లేకుండా కృష్ణ నటించిన తొలి చిత్రం అదే..!

Divya
సూపర్ స్టార్ కృష్ణ మృతి చెందడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఆయన అభిమానులు పూర్తిగా విషాదంలో మునిగిపోయారు. 50 సంవత్సరాలు పాటు నిరంతరాయంగా సాహసమే ఊపిరిగా వెండితెరపై ఎన్నో రికార్డులు సృష్టించిన "మాయదారి మల్లిగాడు" ఇక లేడు అనే విషయం తెలుసుకొని.. వారు పూర్తిస్థాయిలో కన్నీటిని పెట్టుకుంటున్నారు.. ఎన్నో హిట్లు అంతకుమించిన విజయాలు ఆవిష్కరించి.. సినీ సింహాసనం పై మహానటుడిగా వెలుగొందిన కృష్ణతో తమ ప్రాంతానికి.. తమకున్న అనుబంధాన్ని స్మరణకు తెచ్చుకుంటున్నారు. మరి నటశేఖరుడు తన సినీ ప్రస్థానం ఆరంభంలోనే తూర్పుగోదావరి జిల్లాతో అనుబంధం ఏర్పరుచుకున్నారు.

గోదావరికి చెందిన బాపు తీసిన సాక్షి చిత్రం ద్వారా కృష్ణ కెరియర్ ఒక మలుపు తిరిగింది. ఈ సినిమాలో కృష్ణ సినిమా పూర్తయ్యే వరకు మేకప్ లేకుండానే నటించారు.  మానవత్వం మీద నమ్మకం కలిగిన పల్లెటూరి అమాయకుడు పాత్రను ఆయన పూర్తిస్థాయిలో ఒదిగిపోయారు . విజయనిర్మలతో నటించిన తొలి చిత్రం కూడా ఇదే కావడం గమనార్హం. మరి ఈ చిత్ర నిర్మాణం జిల్లాలోని వివిధ ప్రాంతాలలో 20 రోజులకు పైగా కొనసాగింది.  ఆ తర్వాత ఈ సినిమా సూపర్ హిట్ విజయాన్ని అందుకొని ఆయన కెరీర్ కు మైలురాయిగా నిలిచిపోయింది.

తర్వాత వరుస విజయాలతో చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ గా దూసుకుపోయారు కృష్ణ.కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో కృష్ణ నటించిన ఊరికి మొనగాడు చిత్రం షూటింగు రామచంద్రపురం పరిసరాల్లోనేఎక్కువ కాలమే సాగిందని ఇక్కడ ప్రజలు కూడా గుర్తు చేసుకుంటున్నారు. అంతేకాదు అల్లూరి సీతారామరాజు, పాడి పంటలు,  భోగి మంటలు , దొరగారికి స్వాగతం,  నేనంటే నేనే వంటి ఎన్నో చిత్రాలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని షూటింగ్ జరిగాయి. 1974లో తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ తో పాటు అన్నవరం పరిసరాలను తొలిసారిగా తెరకెక్కించారు కృష్ణ.  ఇలా ఎన్నో చిత్రాలను తమ మధ్య చిత్రీకరించిన కృష్ణ  ఇక లేరని తెలిసి ప్రతి ఒక్కరు కన్నీటి పర్యంతమవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: