ఆ క్రేజీ మూవీ లో ఛాన్స్ కొట్టేసిన విజయ్ దేవరకొండ..?

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న యువ హీరో లలో ఒకరు అయినటు వంటి విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే విజయ్ దేవరకొండ తాజాగా లైగర్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళం ,  హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

ఈ మూవీ లో అనన్య పాండే హీరోయిన్ గ నటించగా ,  పూరి జగన్నాథ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. మైక్ టైసన్ ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో నటించగా , రమ్యకృష్ణ ఈ మూవీ లో విజయ్ దేవరకొండ తల్లి పాత్రలో నటించింది. ఇలా లైగర్ మూవీ తో ప్రేక్షకులను తీవ్ర నిరుత్సాహపరిచిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషి అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. శివ నిర్మాణ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ లో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చాలా బాగా పూర్తి అయినట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే విజయ్ దేవరకొండ తాజాగా ఒక క్రేజీ మూవీ లో అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... మోహన్ లాల్ ప్రధాన పాత్రలో వృషభ అనే మూవీ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ క్రేజీ మూవీ లో విజయ్ దేవరకొండ కు ఆఫర్ వచ్చినట్లు , ఈ మూవీ లో విజయ్ దేవరకొండ , మోహన్ లాల్ కు కొడుకు పాత్రలో కనిపించ బోతున్నట్లు ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో అవుతుంది. పిరియాడిక్ డ్రామాగా తేరక్కపోతున్న వృషభ మూవీ 2023 వ సంవత్సరం సెట్స్ పైకి వెళ్ళనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: