సినీ చరిత్రలో ఎన్టీఆర్ కి ధీటుగా నిలబడ్డ ఒకే ఒక్క హీరో అతడే..!

Anilkumar
చలనచిత్ర పరిశ్రమకు మూల స్తంభం అయిన ఎన్టీఆర్ అంటే సినీ ఇండస్ట్రీలో గౌరవ మర్యాదలు మాత్రమే కాదు ఆయనంటే కొంతమందికి భయం కూడా ఉండేది.అయితే నిజానికి ఆయన ఏ ఒక్కరితో కూడా పెద్దగా గొడవలు పెట్టుకునే వారు కాదు. ఇకపోతే ఒకవేళ గొడవలు వస్తే బ్రదర్ అంటూ పక్కకు తప్పుకునేవారు.ఇక  నిర్మాతల మనిషిగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన షూటింగ్ స్పాట్ కి సమయానికంటే ముందే వచ్చి మేకప్ వేసుకొని మరీ నిలబడే వారు. ఇక అంతలా క్రమశిక్షణతో మరింత గుర్తింపు సంపాదించుకున్నారు . ఇదిలావుంటే ఈ క్రమంలోనే ఇండస్ట్రీ పెద్దగా ఆయనను భావించేవారు.. 

అందుకే ఎవరూ కూడా ఆయనకు ఎదురుగా మాట్లాడిన వారు లేదు. తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ ఎన్టీఆర్ కి దీటుగా నిలబడ్డ ఒకే ఒక్క హీరో ఎవరంటే అది సూపర్ స్టార్ కృష్ణ మాత్రమే. ఇక ఇందుకు ఎన్నో ఉదాహరణలు కూడా చెప్పవచ్చు. అయితే ఎన్టీఆర్ గతంలో అల్లూరి సీతారామరాజు సినిమా చేయాలని భావించాడు.ఇకపోతే  ఎన్టీఆర్ చేయాలని అనుకోవడంతో ఆ సినిమాను మరి ఎవరు కూడా చేయలేదు. కానీ  ఇక కృష్ణ మాత్రం తాను చేస్తానంటూ ముందుకు వచ్చాడు.. ఎన్టీఆర్ సన్నిహితులు వద్దంటూ వారించినా కూడా ఊరుకోలేదు. కాగా ఎన్టీఆర్ కూడా మధ్యవర్తి ని నేర్పి తాను చేయాలనుకుంటున్న సినిమాను నువ్వు ఎలా చేస్తావ్ అంటూ వారించే ప్రయత్నం చేశారు.

ఇక అయినా కూడా అల్లూరి సీతారామరాజు సినిమాను కృష్ణ పూర్తి చేయడం జరిగింది. అయితే ఆ సినిమా అద్భుతమైన విజయం సాధించడమే కాదు ఎన్టీఆర్ తోనే ప్రశంసలు అందుకున్నారు కృష్ణ. ఇకపోతే సినీ పరిశ్రమ ఉన్నంతవరకు ఈ సినిమా శాశ్వతంగా నిలిచిపోతుందని చెప్పవచ్చు.  తర్వాత సింహాసనం సినిమాతో పాటు మరెన్నో సినిమాల్లో నేరుగా ఎన్టీఆర్ ను విమర్శించే విధంగా డైలాగులు పెట్టడంతో పాటు సన్నివేశాలను మరియు ఎన్టీఆర్ పోలిన పాత్రలు పెట్టడం ద్వారా కూడా ఎన్టీఆర్ కు సవాల్ విసిరినట్లుగా నిలిచాడు.ఇకపోతే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన సమయంలో చాలామంది ఇండస్ట్రీ వారు ఆయన మార్గంలోనే నడిచారు. అయితే కొందరు మాత్రం ఏ పార్టీకి వెళ్లకుండా ఉన్నారు. కానీ  ఇక కృష్ణ మాత్రం తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి తెలుగుదేశం పార్టీపై, ఎన్టీఆర్ పై దుమ్మెత్తి పోసినట్లుగా కూడా మాట్లాడారు. ఇక దీన్ని బట్టి చూస్తే వీరిద్దరి మధ్య వైరం ఎంతవరకు పెరిగిందో అర్థం చేసుకోవచ్చు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: