బిగ్ బాస్ నామినేషన్‌లో రచ్చ రచ్చ.. ఎలిమినేట్ ఎవరంటే?

Satvika
బిగ్ బాస్ లో ఇప్పుడు రచ్చ చేస్తున్నారు..గత సీజన్ తో పోలిస్తే ఈ సీజన్ కాస్త ఘాటైన సభ్యులు వున్నారు.నువ్వా,నేనా అని వున్నారు.ఇప్పటికే చాలా మంది ఎలిమినేట్ అయ్యారు.ప్రస్తుతం హౌస్ లో స్ట్రాంగ్ ఉన్నవాళ్లు మాత్రమే ఉన్నారు.వీరిలో టాప్ 5కి ఎవరు వెళ్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే టాప్ 5లో ఉంటారనుకున్న వారంతా ఒకొక్కరిగా హౌస్ నుంచి బయటకు వెళ్లిపోతున్నారు. గతవారం డబుల్ ఎలిమినేషన్ తో బాలాదిత్య, వాసంతి ఇద్దరు హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. నిన్నటి ఎపిసోడ్ లో నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. ప్రతివారం ఈ నామినేషన్స్ ప్రక్రియ వాడీవేడీగా జరుగుతుంది. ఈ వారం మొదటి రోజే అది మొదలైంది. ఇక ఈ వారం నామినేషన్ ప్రక్రియకు 'బుట్టలో చెత్త' నామినేట్ చేసిన కంటెస్టెంట్స్ మీద వేయాలని చెప్పారు బిగ్ బాస్.
20 బుట్టల్లో చెత్తను నింపి పెట్టి ఒక్కొక్కరు తాను నామినేట్ చేసే ఇద్దరిపై చెత్తను పూర్తిగా వేసి.. నామినేట్ చేస్తున్నందుకు సరైన కారణం చెప్పాలని తెలిపాడు బిగ్ బాస్. కెప్టెన్ గా ఉన్న ఫైమా తప్ప మిగిలిన 9మంది ఇద్దరిద్దరిని నామినేట్ చేశారు.ఫైమా,రోహిత్, ఇనయ.. ఆదిరెడ్డి, శ్రీహాన్, రోహిత్..ఇనయ ,ఆదిరెడ్డి, రాజ్..శ్రీహాన్ ,రోహిత్, కీర్తి.. మెరీనా , రేవంత్,ఇనయ.. రాజ్ ,మెరీనా, ఇనయ..శ్రీసత్య ,ఇనయ, కీర్తి..రోహిత్ , రేవంత్, ఆదిరెడ్డి..కీర్తి , శ్రీసత్య, మెరీనా..రేవంత్ ,రోహిత్, మెరీనా లను నామినేట్ చేశారు. నామినేషన్స్ ప్రక్రియలో ఇనయ.. రాజ్‌ను నామినేట్ చేసినప్పుడు చిన్న గొడవ జరిగింది. 'వితండవాదం' అనే ట్యాగ్ తనకు రాజ్ ఇవ్వడం నచ్చలేదని ఇనయ చెప్పింది.

ఈ విషయంపై ఇనయతో రాజ్ వాదించాడు. కీర్తి, శ్రీసత్యను నామినేట్ చేసినప్పుడు ఇద్దరి మధ్య గొడవ గట్టిగానే జరిగింది.తనకు 'ఈగో' అనే ట్యాగ్ కీర్తి ఇప్పడం పై శ్రీసత్య ఫైర్ అయ్యింది. ఈగో ట్యాగ్ ఇవ్వడానికి కీర్తి చెప్పిన కారణం కరెక్ట్ గా లేదని శ్రీసత్య చెప్పుకొచ్చింది. కీర్తి పిలిచినప్పుడు తనకు వినబడలేదని.. అంతే తప్ప కావాలని తాను పట్టించుకోకుండా వెళ్లలేదని శ్రీసత్య తెలిపింది. ఈగో అనేదానికి ఎవరినైనా అర్థం అడిగి తెలుసుకుని ఆ ట్యాగ్ తనకు ఇస్తే మంచిదని అంది..దాంతొ ఒకరినొకరు ఎలిమినేట్ చేసుకున్నారు..మొత్తానికి చూసుకుంటే మెరీనా అవుట్ అవుతుందని తెలుస్తుంది..చుద్దాము చివరికి ఎవరూ అవుతారొ..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: