అవంటే భయం అంటున్న ప్రముఖ నటి కవిత..!

Divya
టాలీవుడ్ నటీమణులలో ఒకరైన కవిత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. వెంకన్న బాబు గారి భిన్నమైన పాత్రలు వచ్చేలా జాగ్రత్తలు తీసుకునే వారని కవిత తెలిపింది. ప్రస్తుతం ఒక సినిమా పోస్టర్ చూస్తే ఆ పోస్టర్లోని హీరోయిన్ ఏ సినిమాలో చేశారనే విషయం చెప్పే పరిస్థితి కూడా లేకుండా పోయిందని కవిత తెలిపారు.  ప్రస్తుతం హీరోయిన్ల పాత్రలకు ప్రాధాన్యత ఉండడం లేదని కూడా ఆమె అభిప్రాయపడ్డారు.
ఆ కాలంలో ప్రతి సినిమాలో కొత్తగా కనిపించడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకునే దానిని ఆమె తెలిపింది.  తాను సిగరెట్లు తాగే పాత్రలో కూడా చేశానని,  ఆ సినిమాలో కృష్ణ గారు హీరో అని కవిత వెల్లడించారు.  ఆయన లతా గారిని ప్రేమించాలని ,అలా చేయాలని ఆమె అన్నారు. ఆ తర్వాత నేను కృష్ణ గారు వచ్చిన వెంటనే నేను కావాలని సిగరెట్ స్మోక్ చేసినట్టు నటించాను.  ఆ తర్వాత కృష్ణ గారితో సినిమా కంటిన్యూ చేయాలా?  ఇక్కడితో ఆపేయాలా ? అని అన్నానని కవిత తెలిపారు. మైలు దూరంలో ఎవరైనా సిగరెట్ తాగుతుంటే నేను పారిపోతానని కృష్ణ గారితో నేను అన్నాను.. అలాంటి నన్ను సిగరెట్ కాల్చాలని సూచించడం ఏమిటంటే మూడు గంటలు పట్టింది అంటూ కవిత తెలిపింది ప్యూర్ వెజిటేరియన్ అని ఆమె పేర్కొన్నారు.
ఎలాంటి కష్టమైన సీన్లు అయినా చేస్తాను కానీ జంతువులతో సీన్లు అంటే భయపడతానని కవిత తెలిపారు. మనిషి మృగం సినిమాలో టైగర్ తో కలిసి ఆక్ట్ చేసానని కూడా కవిత తెలిపారు. ఒక సీనులో చేపను పట్టుకోవాలని చెబితే నేను బాగా ఏడ్చేసానని కూడా ఆమె తెలిపారు.  ఏది ఏమైనా కవిత చేసిన ఈ కామెంట్లు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: