చిరు, బాలయ్య, నాగార్జున.. అందరితో కలిసి నటించి వెంకీతో ఎందుకు చేయలేదు..?

Anilkumar
టాలీవుడ్ విక్టరీ వెంకటేష్ టాలీవుడ్ సెకండ్ జనరేషన్ స్టార్ హీరోలలో ఒకరు.ఇక  స్టార్ ప్రొడ్యూసర్, మూవీ మొఘల్ డా.డి.రామానాయుడు గారి చిన్నబ్బాయిగా కెరీర్ ను ప్రారంభించిన వెంకటేష్… తన సొంత టాలెంట్ తో స్టార్ స్టేటస్ ను సంపాదించుకున్నాడు.అయితే  ఇంకో జనరేషన్ స్టార్ హీరోలు వచ్చినప్పటికీ కూడా ఇంకా తన హవాని కొనసాగిస్తున్నారు వెంకీ.  నిజానికి ఈయన హీరో అవ్వాలని అనుకోలేదు. ఇక వాళ్ళ బిజినెస్ వ్యవహారాలు చూసుకోవాలి అని మొదట అనుకున్నారు.వెంకటేష్ హీరోగా మారడానికి కారణం సూపర్ స్టార్ కృష్ణ గారు.  

అయితే రామనాయడు గారు కృష్ణతో ఓ సినిమా చెయ్యాలి.ఇకపోతే అదే 'కలియుగపాండవులు' కానీ ఆయన అదే ప్రాజెక్టుని వేరే నిర్మాతతో చేయాలి అనుకున్నారు. కానీ ఇక రాఘవేంద్ర రావు గారు రామానాయుడు గారికి చేసి పెట్టాలి.అయితే  కృష్ణ గారు వేరే నిర్మాతకి మాట ఇచ్చారు. ఇక ఈ తరుణంలో వేరే హీరో కోసం రామానాయుడు గారు ప్రయత్నిస్తున్నప్పుడు.. కృష్ణ గారు ఫోన్ చేసి మీ ఇంట్లోనే హీరోని పెట్టుకుని ప్రపంచమంతా గాలిస్తావ్ ఏంటి అంటూ ప్రశ్నించారు.?అయితే దీంతో వెంకటేష్ ను విదేశాల నుండి పిలిపించుకుని హీరోగా చేశారు రామానాయుడు గారు.

అయితే కృష్ణ గారు సెకండ్ జనరేషన్ స్టార్ హీరోలందరితో కలిసి నటించారు. కాగా చిరంజీవితో 'కొత్త అల్లుడు' , బాలకృష్ణతో 'సుల్తాన్', నాగార్జునతో 'వారసుడు' వంటి చిత్రాల్లో ఆయన కలిసి నటించారు. కానీ ఇక  వెంకటేష్ తో మాత్రం కృష్ణ గారు కలిసి నటించలేదు.  అయితే ఒక్క 'త్రిమూర్తులు' సినిమాలో ఓ పాటలో వెంకీతో కృష్ణ కొన్ని సెకన్ల పాటు కనిపించారు.ఇక ప్రత్యేకంగా వీళ్ళు కలిసి నటించింది లేదు. చిరు, బాలయ్య, నాగ్ లతో కలిసి నటించిన కృష్ణ గారు వెంకీతో మాత్రమే నటించలేకపోయారు.అయితే  'బలాదూర్' అనే మూవీ వీరి కాంబినేషన్లో రూపొందాల్సి ఉంది. వెంకటేష్ తో 'కలిసుందాం రా' 'ప్రేమతో రా' వంటి చిత్రాలను తెరకెక్కించిన ఉదయ్ శంకర్ తెరకెక్కించిన మూవీ 'బలాదూర్'.  వెంకీ అలాంటి కథలు చాలా చేయడంతో రిజెక్ట్ చేశాడు. ఇక దాంతో అది రవితేజ తో చేశారు. సురేష్ బాబు ఈ చిత్రానికి నిర్మాత..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: