ఓకే హీరోయిన్ తో 3 అంతకన్నా ఎక్కువ సినిమాలు చేసిన టాలీవుడ్ స్టార్ హీరోలు హీరోలు వీరే..!

Pulgam Srinivas
ఓకే హీరోయిన్ తో మూడు అంతకన్నా ఎక్కువ మూవీ లలో నటించిన హీరోలు ఎవరో తెలుసుకుందాం. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటి వరకు కాజల్ అగర్వాల్ తో మూడు సినిమాల్లో హీరోగా నటించాడు. మొదట వీరిద్దరి కాంబినేషన్ లో బృందావనం మూవీ తెరకెక్కింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్  బాద్ షా మూవీ తెరకెక్కింది. ఆ తర్వాత టెంపర్ మూవీ తెరకెక్కింది. జూనియర్ ఎన్టీఆర్ కాజల్ తో పాటు సమంత తో కూడా మూడు సినిమాల్లో హీరోగా నటించాడు.

ఎన్టీఆర్ , సమంత కాంబినేషన్ లో మొదటగా బృందావనం సినిమా తెరకెక్కింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో రభస మరియు జనతా గ్యారేజ్ మూవీ లు తెరకెక్కాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు సమంత కాంబినేషన్ లో ఇప్పటివరకు మూడు సినిమాలు తెరకెక్కాయి. వీరిద్దరి కాంబినేషన్ లో మొదటగా దూకుడు మూవీ తెరకెక్కింది. ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ,  బ్రహ్మోత్సవం సినిమాలు తెరకెక్కాయి. ఈ మూడు మూవీ లలో బ్రహ్మోత్సవం సినిమా తప్ప మిగిలిన రెండు మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి  నాగ చైతన్య మరియు సమంత కాంబినేషన్ లో ఇప్పటివరకు నాలుగు మూవీ లు తెరకెక్కయి. వీరిద్దరి కాంబినేషన్ లో మొదటగా ఏం మాయ చేసావే మూవీ తెరకెక్కింది.

ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో ఆటోనగర్ సూర్య మూవీ వచ్చింది. ఆ తర్వాత మనం మరియు మజిలీ సినిమాలు వచ్చాయి. ప్రభాస్ మరియు అనుష్క కాంబినేషన్ లో ఇప్పటివరకు మూడు సినిమాలు తెరకెక్కాయి. ప్రభాస్ మరియు అనుష్క కాంబినేషన్ లో మొదటగా బిల్లా మూవీ తెరకెక్కింది. ఆ తరువాత మిర్చి , బాహుబలి మూవీ లు తెరకెక్కాయి. రవితేజ , ఇలియానా కాంబినేషన్ లో ఇప్పటివరకు 4 మూవీ లు తెరకెక్కాయి.  వీరిద్దరి కాంబినేషన్ లో కిక్ , ఖతర్నాక్ ,  దేవుడు చేసిన మనుషులు ,  అమర్ అక్బర్ ఆంటోనీ మూవీ లు తెరకెక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: