యశోద: లాభాల బాటలో దూసుకుపోతుందిగా?

Purushottham Vinay
టాలీవుడ్  స్టార్  హీరోయిన్  సమంత 'యశోద' చిత్రంతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నవంబర్ 11 వ తేదీన థియేటర్లలో చాలా గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సైంటిఫిక్ యాక్షన్ సినిమా ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతోంది. మూడు రోజుల్లో 'యశోద' సినిమా దాదాపుగా బ్రేక్ ఈవెన్ కు దగ్గరికి వచ్చినట్టు తెలుస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా ఏకంగా రూ.20 కోట్ల మేర వసూల్ చేసినట్టు తెలుస్తోంది. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి హరి - హరీశ్ దర్శకత్వం వహించడం జరిగింది.తెలుగుతో పాటు మలయాళ , కన్నడ ఇంకా అలాగే హిందీ భాషల్లో కూడా ఈ సినిమాను విడుదల చేశారు. తొలిరోజునే ఏకంగా 6 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది ఈ సినిమా. తొలిరోజు సినిమాకి రూ. 6 కోట్ల గ్రాస్ రాగా.. రూ. 3 కోట్ల మేర షేర్ వసూల్ చేసింది ఈ సినిమా.

రెండోరోజు ఆ కలెక్షన్లు ఏకంగా రూ. 12 కోట్ల గ్రాస్ కు చేరుకోగా.. రూ.5.76 మేర షేర్ ని ఈ సినిమా రాబట్టింది. ఇక మూడో రోజు టోటల్ గా రూ.17.80 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగా.. రూ.8.37 కోట్ల షేర్ ని వసూలు చేసింది. ఇంకా మరో రెండు వారాల వరకూ చెప్పుకోదగిన సినిమాలేవీ లేకపోవడంతో.. 'యశోద' సినిమా మంచి లాభాలు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇలా ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని మంచి సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా USA బాక్స్ఆఫీస్ వద్ద కేవలం విడుదలైన 2 రోజుల్లోనే ఏకంగా $350 మార్క్ ని క్రాస్ చేసింది.ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించగా, మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్‌ చేశారు. ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమాలో రావు రమేష్, వరలక్ష్మి శరత్‌కుమార్, ఉన్ని ముకుందన్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పిక గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంక శర్మ వంటి నటి నటులు ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీదేవి మూవీ బ్యానర్‌పై శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ సినిమాని నిర్మించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: