జబర్దస్త్ లో పారితోషకం పై.. షాకింగ్ విషయం చెప్పిన కమెడియన్ ఆనంద్.

praveen
ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై నెంబర్ వన్ కామెడీ షోగా కొనసాగుతుంది జబర్దస్త్ కార్యక్రమం. దాదాపు గత దశాబ్ద కాలం నుంచి తెలుగు ప్రేక్షకులందరికీ సరికొత్తగా కామెడీ ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే అనామకులుగా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి ఇక జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఊహించిన రీతిలో పాపులారిటీ సంపాదించిన వారు చాలామంది ఉన్నారు. ఇక ఇలా పాపులారిటీ సంపాదించి సినిమాల్లో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ ఎంతో మంది బిజీ బిజీగా మారారు. అయితే జబర్దస్త్ లో ఫేమస్ అయ్యి ఆ తర్వాత వేరే షోలకు వెళ్ళిన వారు కూడా చాలామంది ఉన్నారు అని చెప్పాలి.


 కొంతమందిని జబర్దస్త్ యాజమాన్యం తీసివేస్తే ఇంకొంత మంది మాత్రం స్వయంగా వారే జబర్దస్త్ ను వీడి వెళ్లిపోయారు. అయితే ఇలా జబర్దస్త్ ద్వారా బాగా గుర్తింపు పొందిన ఆర్టిస్ట్ లలో ఆనంద్ కూడా ఒకరు. ఇకపోతే జబర్దస్త్ లో ఎవరికి ఎంత రెమ్యూనరేషన్ ఇస్తారు అన్నది ఇప్పటికీ తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతూ ఉంటారు అందరూ. అయితే ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆనంద్ జబర్దస్త్ షో గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

 చమ్మక్ చంద్ర టీం లో కంటెస్టెంట్ గా చేసిన ఆనంద్ చమ్మక్ చంద్ర జబర్దస్త్ నుంచి తప్పుకున్న తర్వాత టీం లీడర్ గా మారాడు. అయితే అతను చేసే స్కిట్ లకి పెద్దగా రేటింగ్స్ రాకపోవడంతో చివరికి అతన్ని తీసేసి పక్కకు పెట్టారు మల్లెమాల యాజమాన్యం. ఇక ఖాళీగా ఉండలేక జబర్దస్త్ నుంచి బయటకు వచ్చాడు. అయితే జబర్దస్త్ నుంచి బయటకు వచ్చాక ఆనంద్ ఎన్నో కష్టాలను పడ్డాడట.. ఇక అదే సమయంలో జబర్దస్త్ టీం లీడర్స్ పారితోషకం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.. టీం లీడర్లు వేసే స్కిట్ కి వచ్చే రేటింగ్స్ ను బట్టే ఇక వారి రెమ్యూనరేషన్  కూడా డిసైడ్ అవుతుందని చెప్పుకొచ్చాడు చమ్మక్ చంద్ర. సుడిగాలి సుదీర్ వంటి వారికి లక్షల్లో రెమ్యూనరేషన్ ఉంటుందని వాళ్ల టీమ్లలో పనిచేసే కంటెస్టెంట్లకు పదివేల నుంచి 20 వేల వరకు పారితోషకం ఇస్తారని చెప్పుకొచ్చాడు. ఇక తనకు జబర్దస్త్ లో అడుగుపెట్టినప్పుడు మొదట్లో కేవలం 1000 రూపాయలు మాత్రమే ఇచ్చారని.. చంద్ర టీం లోకి వచ్చిన తర్వాత ఒక్క స్కిట్ కి 15000 పారితోషికం ఇచ్చినట్లు గుర్తు చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: