3 రోజుల్లోనే ఏకంగా అన్ని కోట్ల కలెక్షన్లను వసూలు చేసిన "యశోద" మూవీ..!

Pulgam Srinivas
మోస్ట్ టాలెంటెడ్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ నటి మనులలో ఒకరు అయిన సమంత గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికుల ఒక పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఏం మాయ చేసావే మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లో ఒకరిగా కొనసాగుతుంది. ఇది ఇలా ఉంటే సమంత కేవలం తెలుగు మూవీ లలో మాత్రమే కాకుండా తమిళ్ మూవీ లలో కూడా నటించి తమిళ్ ఇండస్ట్రీ లో కూడా అద్భుతమైన క్రేజ్ నీ సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం విడుదల అయిన పుష్ప మూవీ లో సమంత ఒక స్పెషల్ సాంగ్ లో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.
 

ఈ సినిమా సూపర్ హిట్ కావడం , అలాగే ఈ స్పెషల్ సాంగ్ కు కూడా అద్భుతమైన క్రేజ్ రావడంతో పుష్ప మూవీ లోని సాంగ్ ద్వారా సమంత పాన్ ఇండియా రేంజ్ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా సమంత "యశోద" అనే లేడీ ఓరియంటెడ్ మూవీ లో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ఉన్ని ముకుందన్ ,  వరలక్ష్మి శరత్ కుమార్ ,  రావు రమేష్ , మురళి శర్మ ముఖ్యపాత్రలో నటించగా ,  మణిశర్మ ఈ మూవీ కి సంగీతం అందించాడు. హరి శంకర్ , హరీష్ నారాయణ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించారు. ఈ మూవీ నవంబర్ 11 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ ,  మలయాళ , హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది.

ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ లభించింది. దానితో ఈ మూవీ కి అద్భుతమైన కలెక్షన్ లు ప్రపంచవ్యాప్తంగా లభిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదలైన 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసినట్లు ఈ మూవీ యూనిట్ తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఇలా ప్రస్తుతం యశోద మూవీ ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్ లను రాబడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: