కృష్ణ మరో సమస్యతో బాధపడుతున్నారా? సమస్య ఏంటో తెలిస్తే షాక్..,!

Divya

టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎనలేని గుర్తింపు అందుకున్న నటుడు ఘట్టమనేని కృష్ణా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే ఈరోజు ఉదయం ఆయన తీవ్ర అస్వస్థకు గురి కావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాదులోని కాంటినెంటల్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ఇక కృష్ణ గారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక కొద్దిసేపటి క్రితం మరొకసారి ఆయన ఆరోగ్య విషయంలో మరొక అప్డేట్ రావడం జరిగింది.
మహేష్ బాబు తండ్రి ఘట్టం లేని కృష్ణ త్వరగా కోలుకోవాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు కూడా కృష్ణ గారి గురించి,  ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆరాధిస్తున్నారు. అయితే వైద్యులు కూడా ప్రస్తుతం పరిస్థితి అయితే నిలకడగా లేదు అని ఆయన పరిస్థితి చాలా క్లిష్టంగానే ఉంది అని,  శరీరం ట్రీట్మెంట్ కు అంగీకరిస్తుందో లేదో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది అంటూ మొదటిలో వివరణ అయితే ఇచ్చారు. అయితే కృష్ణ గారు గుండెపోటు కారణంగా హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అయితే అక్కడే ఉన్న మహేష్ బాబు భార్య నమ్రత హుటాహుటిన హాస్పిటల్ లో జాయిన్ చేయించారు.  ఇక అప్పటినుండి కుటుంబ సభ్యులందరూ కూడా హాస్పిటల్లోనే ఉంటూ ఎప్పటికప్పుడు వైద్యులతో మాట్లాడుతున్నారు.
ఇక మహేష్ బాబు కూడా తండ్రి గురించి తెలియగానే ఇతర పనులు అన్నింటినీ పక్కనపెట్టి హాస్పిటల్ కి చేరుకున్నారు. ఇదిలా ఉండగా ఆయన మరొక సమస్యతో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు.  వారు నిర్వహించిన మొదటి ప్రెస్ మీట్ అయితే ఆయన పరిస్థితి కష్టంగానే ఉందని చెప్పారు అయితే మొదట గుండెపోటుతో హాస్పిటల్లో జాయిన్ అయిన కృష్ణ గారికి ఇప్పుడు మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ కనిపిస్తోందని కూడా వివరణ ఇచ్చారు.. ఇంకా క్రిటికల్ గానే పరిస్థితి ఉంది అని కూడా తెలిపారు.  మొత్తం 8 మంది టాప్ డాక్టర్ లు పర్యవేక్షిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఆయనను రక్షించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు వైద్యులు. కృష్ణ గారు త్వరగా కోలుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: