అరుదైన గౌరవాన్ని అందుకున్న రణ్ విర్ సింగ్..!

Pulgam Srinivas
బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న రన్విర్ సింగ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రన్వీర్ సింగ్ ఇప్పటికే అనేక బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరో గా నటించి ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపు ను దక్కించుకున్నాడు. ఇది ఇలా ఉంటే రన్వీర్ సింగ్ ఇప్పటి వరకు నేరుగా ఒక్క తెలుగు మూవీ లో కూడా నటించకపోయినప్పటికీ , ఈ హీరో తాను నటించిన హిందీ మూవీ ల ద్వారానే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు ను దక్కించుకున్నాడు.

రన్వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన బాజీరావు మస్తానీ , పద్మావత్ సినిమాలు తెలుగు లో కూడా మంచి విజయాలను సాధించాయి. ఈ సినిమాల ద్వారా రన్బీర్ సింగ్ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ లభించింది. రన్బీర్ సింగ్ ఆఖరుగా 83 అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. దీపికా పదుకొనే ఈ మూవీ లో రన్వీర్ సింగ్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇది ఇలా ఉంటే తాజాగా రన్వీర్ సింగ్ కు ఒక అరుదైన గౌరవం లభించింది.

మరాక లోని "మర్రకెచ్" ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో రన్వీర్ సింగ్ నటించిన బాజీరావు మస్తానీ ,  గల్లి భాయ్ , పద్మావత్ సినిమాలను ప్రదర్శించారు. ఈ ఫెస్టివల్ లో రన్వీర్ సింగ్ ను ఏటోయిల్ డి ఓర్ అవార్డ్ తో సత్కరించారు. గతంలో ఈ అవార్డ్ బాలీవుడ్ హీరోలు అయినటు వంటి అమితాబ్ ,  షారుక్ ఖాన్ , అమీర్ ఖాన్ లు అందుకున్నారు. ఇలా తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయిన రన్వీర్ సింగ్ అరుదైన గౌరవాన్ని అందుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: