విక్రమ్ గోల్డెన్ వీసా వెనుక పూర్ణ హస్తం !

Seetha Sailaja
కన్నడ హీరోయిన్ పూర్ణ ఎంత ప్రయత్నించినప్పటికీ టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకోలేకపోయింది. దీనితో ఇక లాభం లేదనుకుని ఆమె దుబాయ్ కి చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్తను పెళ్ళి చేసుకుని దుబాయ్ లో సెటిల్ అయిపోయింది.

అయితే విక్రమ్ కు లేటెస్ట్ గా వచ్చిన గోల్డెన్ వీసా వెనుక ఆమె హస్తం ఉండటం చాలామందిని ఆశ్చర్యపరిచింది. దుబాయ్ ప్రభుత్వం పలువురు భారతీయ నటీనటులకు గోల్డెన్ వీసాలు యిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ లిస్టులోకి తమిళ టాప్ హీరో విక్రమ్ కూడ చేరిపోయాడు. ఈవిషయాన్ని స్వయంగా పూర్ణ వివరిస్తూ దీనికి సంబంధించిన ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పూర్ణ విక్రమ్ గోల్డెన్ వీసా వెనుక ఆమె హస్తం ఏమిటి అంటూ చాలామంది ఆశ్చర్యపోతున్నారు.

అయితే దీనివెనుక ఒక ఆసక్తికర విషయం ఉంది. పూర్ణ భర్త షమ్యా ఖాసిమ్ దుబాయ్ లో పెద్ద బిజినెస్ మ్యాన్. ప్రస్తుతం అతను అక్కడ అనేక వ్యాపారాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇతడి ద్వారానే విక్రమ్ కు గోల్డెన్ వీసా వచ్చిందని ప్రచారం జరుగుతోంది. విద్య సాహిత్యం సినిమా రంగాలలో విశిష్ట సేవలు అందించిన భారతీయులకు దుబాయ్ ప్రభుత్వం గోల్డెన్ వీసా అందిస్తూ ఉంటుంది.

ఈ వీసా పొందిన వారు వారికి నచ్చిన ఉద్యోగం లేదా వ్యాపారం చేసుకోవడమే కాకుండా ఇలాంటి వీసా పొందిన వారిని దుబాయ్ ప్రభుత్వం చాల ప్రత్యేకంగా గౌరవిస్తూ ఉంటుంది. 2019 నుంచి యూఏఈ ప్రభుత్వం ఈ గోల్డెన్ వీసాలు మంజూరు చేస్తోంది. ఇప్పటి వరకు కమల్ హాసన్  మోహన్ లాల్ మమ్ముట్టి షారుక్ ఖాన్ త్రిష కాజల్ అగర్వాల్ ఉపాసన సుకుమార్ లకు ఇలాంటి గోల్డెన్ వీసాలు ఇచ్చారు. ఇప్పుడు ఆ లిస్టులో విక్రమ్ కూడ చేరాడు. విలక్షణమైన పాత్రలతో కూడిన సినిమాలు చేయడంలో కమలహాసన్ తరువాత విక్రమ్ కు విపరీతమైన పేరు ఉంది. ప్రస్తుతం మహాభారత యుద్ధ నేపద్యంలో కర్ణుడి జీవితం ఫై హై బడ్జెట్ తో తీస్తున్న మూవీతో మళ్ళీ విక్రమ్ హవా మొదలవుతుందని అతడి అభిమానులు ఆశిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: