బన్నికి థ్యాంక్స్ చెప్పిన కలెక్టర్..ఎందుకంటే?

Satvika
తెలుగు అగ్రహీరో అల్లు అర్జున్ కు కేరళ స్టేట్ జిల్లా కలెక్టర్ సోషల్ మీడియా వేదికగా థాంక్యూ చెప్పాడు. అల్లు అర్జున్ 'డీజే' సినిమాలో.. కేరళ లోని అలప్పుజాకు చెందిన ఒక ఇంటర్ చదివే యువతి, 92 శాతం మార్కుల తో ఉత్తీర్ణత సాధించినా తండ్రి చనిపోవడంతో ఆర్ధికసాయం లేక చదవలేకపోతున్నానంటూ అలెప్పి కలెక్టర్ వీఆర్ కృష్ణ తేజకు తెలియజేసింది. ఇక అధికారులు 'VR for Alley' ప్రాజెక్ట్‌లో భాగంగా ఆ యువతికి అవసరమైన సహాయం అందేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే వీరికి ఒక స్పాన్సర్ కావాల్సి వచ్చింది.

దీంతో అధికారులు అల్లు అర్జున్ ని సంప్రదించి ఒక సంవత్సరానికి గాను స్పాన్సర్‌షిప్ ని కోరగా.. బన్నీ ఏకంగా ఆ యువతి కంప్లీట్ స్టడీస్ ఖర్చుతో పాటు హాస్టల్ ఖర్చులు కూడా భరిస్తాను అని మాట ఇచ్చాడట. అయితే ఈ విషయాన్ని కేరళ కలెక్టర్ సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ కి కృతజ్ఞతలు తెలియజేయడం తో బయటికి వచ్చింది. ఈ సంగతి తెలిసిన అభిమానులు అల్లు అర్జున్ ని అభినందిస్తున్నారు.. ఈ వార్త విన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు..

ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే.. పుష్ప ఎంతటి ఘన విజయాన్ని అందుకుందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈ సినిమా తో బన్నీ కూడా పాన్ ఇండియా హీరో అయ్యాడు.. కంప్లీట్ మాస్ లుక్ లో కనిపించి అందరినీ ఆకర్షించాడు.ఆ సినిమా మళ్ళీ వస్తే బాగుండు అని సినీ అభిమానులు అనుకుంటున్నారు.. అందుకే డైరెక్టర్ సుకుమార్ ఇప్పుడు మరో ఆ సినిమాకు సీక్వెల్ ను ప్లాన్‌ చేస్తున్నారు. పుష్ప 2 పేరు తో సినిమా రానుంది.ఈ సినిమా షూటింగ్ ఇటీవల మొదలైంది.. మరి ఎ రేంజ్ లో ఉంటుందో తెలియాలంటే సినిమా వచ్చే వరకూ ఆగాల్సిందే..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: