బిల్లా సినిమాపై అనుష్క షాకింగ్ కామెంట్స్..

Satvika
ప్రభాస్ హీరోగా నటించిన సినిమా బిల్లా గురించి ప్రత్యెకంగా చెప్పాల్సిన పనిలేదు.. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.కానీ అనుకున్న విజయాన్ని మాత్రం అందుకోలేక పోయింది.2009వ సంవత్సరంలో మెహర్ రమేష్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం 'బిల్లా'. ఈ సినిమాలో ప్రభాస్ నీ చాలా పవర్ ఫుల్ డాన్ పాత్రలో స్టైలిష్ గా చూపించడం జరిగింది.ఇక ఇదే సినిమా లో అనుష్క కూడా లేడీ డాన్ పాత్రలో కనిపించడం జరిగింది. గ్లామర్ పరంగా ఈ సినిమా అనుష్కకి మంచి పేరు తీసుకొచ్చింది.

బిల్లా సినిమా ముందు అరుంధతి, భాగమతి వంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసి డిఫరెంట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.ఇలాంటి సినిమాల తర్వాత ‘బిల్లా’ చేయటం అనేది సాహసోపేతమైన నిర్ణయం. అయితే ఈ సినిమా లో మొదటిసారి బికినీ వేసుకోవడం.. వల్ల చాలా ఇబ్బందులు పడ్డాను అంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో అనుష్క తెలియజేయడం జరిగింది. నవంబర్ 8వ తారీకు అనుష్క పుట్టిన రోజు నేపథ్యంలో… నవీన్ పోలిశెట్టితో చేస్తున్న ప్రయోగాత్మకమైన సినిమా లుక్ రిలీజ్ అయింది. ఈ సినిమాలో కెరియర్ ప్రారంభం లో ఎటువంటి లుక్ లో కనిపించిందో అదే తరహాలో ఉంది.

బాహుబలి’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత… ‘సైజ్ జీరో’ వంటి ప్రయోగాత్మకమైన సినిమా స్వీటీ అనుష్క చేయడం తెలిసిందే. ఈ సినిమా కోసం భారీగా లావు పెరిగింది. కానీ “సైజు జీరో” సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దీంతో అప్పటినుండి అనుష్కకి అవకాశాలు రావడం తగ్గుముఖం పట్టింది. ఇలాంటి తరుణంలో యూవి క్రియేషన్స్ నిర్మాణ సంస్థ లో నవీన్ పోలిశెట్టితో ప్రేమ కథ నేపథ్యంలో అనుష్క చేస్తున్న సినిమా ఆమె ఎలాంటి హిట్ టాక్ ను అందిస్తుందొ చూడాలి.. మరోవైపు అనుష్క పెళ్ళి పై కూడా వార్తలు వస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: