ప్రపంచవ్యాప్తంగా అన్ని థియేటర్లలో విడుదల కానున్న సమంత "యశోద" మూవీ..!

Pulgam Srinivas
టాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి సమంత తాజాగా యశోద అనే మూవీ లో ప్రధానపాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ నీ నవంబర్ 11 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా తమిళ , హిందీ , మలయాళ , కన్నడ భాషలలో కూడా నవంబర్ 11 వ తేదీనే విడుదల చేయనున్నారు. ఈ మూవీ లో ఉన్ని ముకుందన్ , వరలక్ష్మి శరత్ కుమార్ , రావు రమేష్., మురళీ శర్మ ప్రధాన పాత్రలలో నటించగా , హరి శంకర్ , హరీష్ నారయన్ ఈ మూవీ కి దర్శకత్వం వహించారు.

ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడం తో ఈ మూవీ పై సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్న నేపథ్యంలో ఈ మూవీ ని ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా యశోద మూవీ ఎన్ని థియేటర్ లలో విడుదల కాబోతుందో తెలుసుకుందాం .


నైజాం : 195
 సీడెడ్ : 80
ఆంధ్ర : 225 ప్లస్
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి యశోద మూవీ 500 ప్లస్ థియేటర్ లలో విడుదల కాబోతుంది.
రెస్ట్ ఆఫ్ ఇండియాలో 600 ప్లస్ థియేటర్ లలో యశోద మూవీ విడుదల కాబోతుంది.
ఓవర్ సీస్ లో 240 ప్లస్
ప్రపంచ వ్యాప్తంగా యశోద మూవీ 1350 థియేటర్ లలో విడుదల కాబోతుంది. యశోద మూవీ పై పన్ ఇండియా రేంజ్ లో మంచి అంచనాలు కలిగి ఉన్నాయి. మరి ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత సమయం వేచి చూడాల్సిందే. ఈ మూవీ కి మణిశర్మ సంగీతం అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: