కాంతార: ఓటిటి విడుదల వాయిదా?

Purushottham Vinay
ప్రస్తుతం అంతగా ఆకట్టుకునే పెద్ద సినిమాలు లేకపోవడం, ఉన్న సినిమాలు సరిగ్గా ఆడకపోవడంతో కాంతార సినిమాకు చాలా బాగా కలిసొచ్చింది. రిలీజ్  అయిన దగ్గర నుంచి కొన్ని రోజులుగా టాలీవుడ్ మార్కెట్ ను ఈ సినిమా ఏలుతోంది.ఇంకా అలాగే మరో వారం రోజుల పాటు ఈ సినిమాకు తెలుగులో పోటీ లేదు. ఎందుకంటే, సమంత నటించిన యశోద సినిమా తప్ప మరో పెద్ద ప్రాజెక్టు థియేటర్లలోకి రావడం లేదు.ఇంకా మరోవైపు కాంతార సినిమాపై మంచి అంచనాలున్నాయి. రోజురోజుకు ఈ సినిమాకు మౌత్ టాక్ చాలా విపరీతంగా పెరుగుతోంది. ఈ సినిమాను చూస్తే థియేటర్లలోనే చూడాలంటున్నారు ప్రేక్షకులు. దీంతో సాధారణ రోజుల్లో కూడా కాంతార సినిమాకు ఒక రేంజిలో ఆక్యుపెన్సీ ఉంటోంది. ప్రతి రోజూ కూడా ఈ సినిమాకు మంచి వసూళ్లు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో కాంతారపై ఊహించని దెబ్బ పడింది. అది అమెజాన్ ఓటిటి రూపంలో ఎదురైంది.


ఈ నెల్లోనే కాంతార సినిమాను అమెజాన్ లో స్ట్రీమింగ్ చెయ్యబోతున్నారు. రేపోమాపో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వస్తుంది.అయితే ఇన్ని రోజులు అయినా సినిమా చాలా బాగా పెర్ఫార్మన్స్ చేస్తుండటంతో నిర్మాతలు అమెజాన్  వాళ్ళని స్ట్రీమింగ్   పోస్టుపోన్ చేసుకోమన్నారట. ఇప్పటికీ కూడా ఈ సినిమా రోజుకి కోటి రూపాయలు దాకా షేర్ వసూళ్లు చేస్తుంది. ఇంత లాభం వస్తుండగా అప్పుడే ఓటిటి స్ట్రీమింగ్ ఎందుకని కాంతార మేకర్స్ వాయిదా వేసుకోమన్నారట.ఇక కాంతార సినిమా ఇప్పటివరకు టోటల్ గా 400 కోట్లు వసూళ్లు సాధించిందని సమాచారం తెలుస్తుంది.20 కోట్లలోపు బడ్జెట్ తో తెరకెక్కి ఈ రకంగా వసూళ్లు సాధించడం అంటే అసలు మామూలు విషయం కాదు అనే చెప్పాలి. ఇక లాంగ్ రన్ లో కాంతార ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.రిషబ్  శెట్టి డైరెక్ట్  చేసి హీరోగా నటించిన ఈ సినిమాలో సప్తమి గౌడ హీరోయిన్  గా నటించింది. హోంబోలె ఫిలిమ్స్  సంస్థ ఈ సినిమాని నిర్మించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: