సమంత "యశోద" మూవీ రన్ టైమ్ లాక్..!

Pulgam Srinivas
టాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి సమంత గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సమంత ఇప్పటికే ఎన్నో కమర్షియల్ మూవీ లలో నటించి ప్రేక్షకులను అలరించింది. అలాగే ఎన్నో వైవిధ్యమైన మూవీ లలో  , తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న మూవీ లలో నటించి కూడా ఈ ముద్దు గుమ్మ ప్రేక్షకులను అలరించింది. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో సమంత ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ మూవీ లలో , తనకు పాత్ర ప్రాధాన్యత ఉన్న మూవీ లలో నటిస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా సమంత లేడీ ఓరియంటెడ్ మూవీ యశోద లో ప్రధాన పాత్రలో నటించింది.

ఈ మూవీ నవంబర్ 11 వ తేదీన విడుదల కాబోతోంది. ఈ మూవీ కి హరి శంకర్ , హరీష్ నారాయణ్ దర్శకత్వం వహించగా , మణిశర్మ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ లో ఉన్ని ముకుందన్ , వరలక్ష్మి శరత్ కుమార్ , రావు రమేష్ ,  మురళీ శర్మ ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా యశోద మూవీ యూనిట్ ఈ సినిమా రన్ టైమ్ కూడా లాక్ చేసింది.

ఈ మూవీ 2 గంటల 15 నిమిషాల నిడదవో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలా సమంత ప్రధాన పాత్రలో తేరకేక్కిన యశోద మూవీ మామూలు నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.  ఈ మూవీ తెలుగు , తమిళ , కన్నడ ,  మలయాళ , హిందీ భాషలో విడుదల కాబోతోంది. ఈ మూవీ ఏ రేంజ్ విజయ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంతకాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: