కరోనా తర్వాత హిందీలో అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన 6 తెలుగు సినిమాలు ఇవే..!

Pulgam Srinivas
కరోనా తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి ఎన్నో సినిమాలు విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. అందులో కొన్ని సినిమాలు హిందీ లో కూడా విడుదల అయ్యాయి. కరోనా తర్వాత హిందీ లో అత్యధిక కలెక్షన్ లను సాధించిన 6 తెలుగు సినిమాల వివరాలను తెలుసుకుందాం.


దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ మూవీ హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర 275 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైస్ మూవీ హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర 112 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. నిఖిల్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా చందు మండేటి దర్శకత్వం లో తెరకెక్కిన కార్తికేయ 2 మూవీ హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర 21 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. విజయ్ దేవరకొండ హీరోగా అనన్య పాండే హీరోయిన్ గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ సినిమా హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర 19 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజ హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ దర్శకత్వం లో తెరకెక్కిన రాదే శ్యామ్ మూవీ హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర 17 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. అడవి శేషు హీరోగా శశికిరణ్ తిక్క దర్శకత్వం లో తెరకెక్కిన మేజర్ సినిమా హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర 12 కోట్ల కలెక్షన్ లను వసూలు చేస్తుంది. ఈ 6 తెలుగు మూవీ లు కరోనా తర్వాత బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అత్యధిక కలెక్షన్ లను సాధించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: