రాజ్‌, మెరీనా కంటే ఆర్జే సూర్య వీకా? ఇది ఎక్కడి విడ్డూరం భయ్యా....!!!

murali krishna
తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 నుండి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిపోతున్నారు అంటూ ప్రేక్షకులు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యం గా సూర్య ఎలిమినేట్ అయిన సమయం లో ఇది కచ్చితం గా సరైన ఎలిమినేషన్ కాదంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు.బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్స్ లో చాలా మంది వీక్ కంటెస్టెంట్స్ ఉన్నారు. వారిలో కొందరు ఎలిమినేట్ అయ్యి వెళ్లి పోగా ఇంకా కొందరు హౌస్ లో కొనసాగుతున్నారు. ముఖ్యంగా రాజ్, మెరీనా లతో పాటు మరో ఇద్దరు ముగ్గురు కూడా సూర్య తో పోలిస్తే చాలా వీక్ అయినా కూడా వారిని కొనసాగిస్తూ సూర్య ని ఎలిమినేట్ చేయడం చాలా విడ్డూరంగా ఉంది అంటూ బిగ్ బాస్ ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియా లో ఈ విషయం గురించి ప్రముఖంగా జరుగుతుంది. సూర్య ని ఎలిమినేట్ చేయడం ఏ మాత్రం సరైన నిర్ణయం కాదంటూ వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సూర్య మరో నాలుగైదు వారాలు ఉండాల్సిందని.. ఆయన కి ఉన్న ఫాలోయింగ్ తో మంచి పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. కనుక మరి కొన్ని వారాలు ఉండాల్సిందని సోషల్ మీడియా ద్వారా జనాలు కామెంట్ చేస్తున్నారు.
కంటెస్టెంట్స్ యొక్క ప్రదర్శన ఆధారం గా కాకుండా మరో ప్రాతిపదికన ఎలిమినేషన్ కార్యక్రమం జరుగుతుంది అంటూ చాలా మంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. సూర్య కి ఈ విషయమై చాలా మంది మద్దతు లభిస్తుంది. బిగ్ బాస్ సీజన్ 6 నుండి ఇప్పటికే చాలా మంది జెన్యూన్ పర్సన్స్ ఎలిమినేట్ అయ్యారు. బిగ్ బాస్ గత సీజన్ లో కూడా ఇలాంటి ఎలిమినేషన్ జరిగాయి. అందుకే ప్రేక్షకుల్లో బిగ్ బాస్ పై ఆసక్తి తగ్గుతుంది అంటూ మీడియా లో ప్రచారం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: