సమంత "యశోద" మూవీ ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Pulgam Srinivas
టాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి సమంత గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సమంత తాజాగా యశోద అనే లేడీ ఓరియంటెడ్ మూవీ లో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి హరి శంకర్ , హరీష్ నారాయణ్ దర్శకత్వం వహించగా ,  ఉన్ని ముకుందన్  , వరలక్ష్మి శరత్ కుమార్ ,  రావు రమేష్ , మురళి శర్మ ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ ని నవంబర్ 11 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని పాన్ ఇండియా మూవీ గా రూపొందించారు.

నవంబర్ 11 వ తేదీన యశోద మూవీ ని తెలుగు తో పాటు తమిళ ,  కన్నడ , హిందీ , మలయాళ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడం తో ఈ మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇలా సినీ ప్రేమికుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మరి యశోద మూవీ ప్రపంచ వ్యాప్తంగా జరుపుకున్న ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలను తెలుసుకుందాం.
నైజాం : 4.5 కోట్లు .
సీడెడ్ :  1.50 కోట్లు .
ఆంధ్ర :  5.50 కోట్లు .
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి యశోద మూవీ 11.50 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుంది.


కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్ సీస్ లో లలో కలిపి ఈ మూవీ కి 4 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
ప్రపంచ వ్యాప్తంగా యశోద మూవీకి 15.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. యశోద మూవీ ప్రపంచ వ్యాప్తంగా 16.50 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసినట్లు అయితే క్లీన్ హిట్ గా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: