ఆ పండుగను లక్ష్యంగా పెట్టుకున్న ఎన్టీఆర్ 30 వ మూవీ యూనిట్..?

Pulgam Srinivas
జూనియర్ ఎన్టీఆర్ ఈ సంవత్సరం ఆర్ ఆర్ ఆర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే  ఈ మూవీ ద్వారా ఎన్టీఆర్ అద్భుతమైన విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా , ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన  క్రేజ్ ను కూడా సంపాదించుకున్నాడు. ఆర్ ఆర్ మూవీ ద్వారా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి మూవీ ని కొరటాల శివ దర్శకత్వం లో చేయబోతున్నాడు. ఈ మూవీ కూడా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయి కి మించిన మూవీ గా రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని దాదాపు 9 భాషలలో విడుదల చేయబోతున్నట్లు సమాచారం.

ఇలా ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో చాలా భాషలలో విడుదల చేయనున్న నేపథ్యంలో ఈ మూవీ కథ విషయంలో పక్కా క్లారిటీ వచ్చాకే ఈ మూవీ ని సెట్స్ పైకి తీసుకువెళ్లాలి అనే ఉద్దేశంతో ఉన్న కొరటాల శివ ఈ మూవీ షూటింగ్ ను ప్రారంభించడానికి మరి కాస్త సమయం తీసుకోనే అవకాశం కనిపిస్తోంది. ఇది ఇలా ఉంటే సినిమా సెట్స్ పైకి వెళ్లాక మాత్రం ఫుల్ స్పీడ్ లో ఈ మూవీ షూటింగ్ ను ముగించి ,  అతి తక్కువ కాలం లోనే ఈ మూవీ ని విడుదల చేసే ఆలోచనలో మూవీ యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా ఈ మూవీ షూటింగ్ మరి కొన్ని రోజుల్లోనే మొదలు పెట్టి , ఈ మూవీ ని దసరా పండుగ కు విడుదల చేసే ఉద్దేశంతో మూవీ యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది  దానితో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ దసరా పండుగ ను లక్ష్యంగా పెట్టుకొని ఈ సినిమా షూటింగ్ ను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది  ఇది ఇలా ఉంటే అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందించనుండగా ,  రత్నవేలు ఈ మూవీ కి సినిమాటో గ్రాఫర్ గా వర్క్ చేయనున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: