అల్లు శిరీష్ కు కంగ్రాట్స్ చెప్పిన నిఖిల్..!

Pulgam Srinivas
టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరు అయినటు వంటి అల్లు శిరీష్ తాజాగా శ్రీరస్తు శుభమస్తు అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ మంచి అంచనాలు నడుమ నవంబర్ 4 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ప్రస్తుతం ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్సి లభిస్తుంది. ఈ మూవీ కి ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లు కూడా లభిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో అల్లు శిరీష్ సరసన అను ఇమన్యుయల్ హీరోయిన్ గా నటించగా ,  రాకేష్ శశి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు.

శ్రీ తిరుమల ప్రొడక్షన్ మరియు గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ పతాకాల పై నిర్మించిన ఈ మూవీ కి అచ్చు రాజమణి, అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఊర్వశివో రాక్షసివో మూవీ గురించి టాలీవుడ్ యంగ్ హీరో అయినటు వంటి నిఖిల్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.  నిఖిల్ తాజాగా ఊర్వశివో రాక్షసివో  మూవీ గురించి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ... ఊర్వశివో రాక్షసివో సినిమాకి పాజిటివ్ టాక్ రావడం పట్ల నిఖిల్ సిద్ధార్థ్ సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాక అల్లు శిరీష్ కి నిఖిల్ కంగ్రాట్స్ తెలిపారు. త్వరలో ఈ మూవీని థియేటర్ లలో చూస్తాను అని తెలిపారు.

ఇది ఇలా ఉంటే తాజాగా నిఖిల్ "కార్తికేయ 2" మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని 100 కోట్లకు పైగా కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర కొల్లగొట్టింది. కార్తికేయ 2 మూవీ తో నిఖిల్ అద్భుతమైన క్రేజ్ ను దేశవ్యాప్తంగా సంపాదించుకున్నాడు. ప్రస్తుతం నిఖిల్ అనేక క్రేజీ మూవీ లలో హీరోగా నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: