అల్లు శిరీష్ కి హిట్ పడినా క్రేజ్ రాలేదా!!

P.Nishanth Kumar
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో మెగా హీరోలలో ఒకరైన అల్లు అర్జున్ ఇటీవల ఊర్వశివో రాక్షసివో అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. చాలా రోజుల తర్వాత ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ సినిమాను చూసిన ఫీలింగ్ కలిగిందని ప్రేక్షకులందరూ కూడా చెబుతున్నారు. ముఖ్యంగా ద్వితీయర్థం లో సినిమా ఎంతో హ్యాస్యం ఉందని మంచి కామెడీ సీన్లు ఉన్నాయని కడుపుబ్బ నవ్వే సన్నివేశాలు ఉన్నాయని ప్రేక్షకులు చెబుతున్నారు. ఏదైతేనేమి ఈ సినిమా ఇటు హీరోకు అటు నిర్మాతకు మంచి హిట్ ఇచ్చింది.

అయితే ఇంతటి విజయాన్ని అందుకున్న కూడా ఈ సినిమాకు సరైన కలెక్షను రాకపోవడం ఒకసారిగా అందరినీ ఆశ్చర్య పరుస్తుంది. ఇటీవల కాలంలో ప్రేక్షకులందరూ కూడా ఓటీటీ లో సినిమాలు చూడడానికి అలవాటు పడిన నేపథ్యంలో ఇలాంటి సినిమాలు థియేటర్లలో చూడడం కంటే ఓటీటీ లలో బెస్ట్ అనుకున్నారో ఏమో ఈ సినిమాకు ఎవరూ కూడా తరలిరావడం లేదు. ఇంత మంచి టాక్ ఉన్నా కూడా ఈ సినిమాకు రాకపోవడానికి ముఖ్య కారణం అదే అని తెలుస్తుంది. ఇంకొక వైపు  అల్లు శిరీష్ గత కొన్ని రోజులుగా ప్రేక్షకులను ఏమాత్రం అలరించే సినిమాలను చేయలేదు. 

వాస్తవానికి ఆయన అసలు సినిమా చేసి చాలా రోజులు అయిపోయిందని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఒక మంచి కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు రావాలని చెప్పి టైం తీసుకుని ఇప్పుడు ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా మంచి టాక్ వచ్చినా కూడా ప్రేక్షకుల ఆదరణ దక్కక పోవడానికి కారణం చిత్ర బృందాన్ని ఎంతగానో బాధపడుతుంది. ప్రమోషన్ కార్యక్రమాలను మరింతగా చేస్తే ఈ సినిమా అందరి ప్రేక్షకులకు చేరువయ్య అవకాశాలు లేకపోలేదు. అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు రాకేష్ శశి దర్శకత్వం వహించిన గీత ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాను దినేష్ మొగిలినేని నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: