అక్కినేని అఖిల్ మనసు మార్చుకున్న్నాడా!!

P.Nishanth Kumar
అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న ఏజెంట్ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు చాలానే ప్రయత్నాలు చేశారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందన్న నమ్మకంతో మొదటగా ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని భావించారు. అయితే కారణమేంటో తెలియదు కానీ ఈ సినిమా ఇప్పుడు సంక్రాంతికి రావటం లేదనే వార్త  మీడియా నుంచి వినబడుతుంది.

ఈ సినిమా ను నిర్మాతలు సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచన నుంచి విరమించుకుంటున్నారట. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావలసి ఉండగా చిత్రీకరణ ఆలస్యమైన నేపథ్యంలో ఈ సినిమాను ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చారు. ఫైనల్ గా డిసెంబర్లో ఈ సినిమాను విడుదల చేయాలని భావించారు కానీ అప్పుడు కూడా ఈ సినిమా విడుదల కాలేదు. దాంతో సంక్రాంతికి పక్కాగా వస్తుందని భావించారు. కానీ సంక్రాంతికి కూడా ఈ సినిమాను క్యాన్సల్ చేయడం అక్కినేని అభిమానులను ఎంతగానో నిరాశ పరుస్తుంది.

ఇప్పటి వరకు అయితే ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారు అన్న విషయమై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు చిత్ర బృందం. అయితే ఈ సినిమా ఆర్థిక సమస్య లలో కొట్టుమిట్టాడుతుండటమే ఈ సినిమా ఇంతటి స్థాయిలో ఆలస్యం అవడానికి కారణం అవుతుంది అని చెబుతున్నారు. సురేందర్ రెడ్డి కూడా ఈ చిత్రంలోని నిర్మా ణ భాగస్వామి గా ఉన్నాడు ఈ నేపద్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించే విధానంలో ఎలాంటి పొరపాటు చేశాడో తెలియదు కానీ అది సినిమా విడుదలపై ఇంతటి ప్రభావం చూపుతుంది అని ఎ వరు కూడా అనుకోలేదు. మరి అన్ని ఇబ్బందులను తొలగించుకుని ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో చూడాలి. ఈ సినిమా కు తమన్ సంగీతం సమకూరుస్తు ఉండగా సాక్షి వైద్య హీరోయిన్ గా హీరోయిన్ గా నటిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: