క్రేజీ తమిళ మూవీలో ఛాన్స్ కొట్టేసిన అను ఇమాన్యుయల్..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ అను ఇమ్మాన్యుయల్ గురించి కొత్తగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ మజ్ను మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అనేక తెలుగు మూవీ లలో నటించి , తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ను ఏర్పరచుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా అను ఇమ్మానుయేల్ "ఊర్వశివో రాక్షసివో" అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో అల్లు శిరీష్ హీరోగా నటించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ నవంబర్ 4 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ని తెచ్చుకోవడంతో , ప్రస్తుతం ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లు లభిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ మంచి గుర్తింపును ఏర్పరచుకున్న అను ఇమ్మానుయేల్ తమిళ సినిమా ఇండస్ట్రీ లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది.
 

ఈ ముద్దుగుమ్మ తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయిన కార్తీ హీరోగా తెరకెక్కబోయే మూవీ తో తమిళ సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. కార్తీ హీరోగా రాజు మురుగన్ దర్శకత్వంలో జపాన్ అనే మూవీ ఈ రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ మూవీ లో కార్తీ సరసన అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటించబోతుంది. ఈ మూవీ తో ఈ ముద్దుగుమ్మ తమిళ సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. మరి జపాన్ మూవీ తో అను ఇమ్మానుయేల్ తమిళ సినీ ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అను ఇమ్మానుయేల్ తెలుగు లో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న రావణాసుర మూవీ లో కీలక పాత్రలో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: