ప్రభాస్ మారుతి మూవీలో ఆ మలయాళ స్టార్ హీరో..?

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటు వంటి మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ఎలాంటి హడావిడి లేకుండా ప్రారంభం అయింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ మంచి స్పీడ్ లో జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్ లు కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
అందులో భాగంగా ఇప్పటికే చిత్ర బృందం ఈ మూవీ లో ఇద్దరు హీరోయిన్ లను సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ప్రభాస్ సరసన నిధి అగర్వాల్ , మాళవిక మోహన్ ను సెలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. మరొక హీరోయిన్ ని కూడా ఫైనల్ చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో సంజయ్ దత్ విలన్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ , మారుతి కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ కథ ప్రకారం ఈ మూవీ లో ప్రభాస్ కు తాత పాత్ర ఒకటి ఉండబోతున్నట్లు , ఈ పాత్ర ఈ సినిమాకే హైలైట్ గా ఉండబోతున్నట్లు ఒక వార్త చాలా రోజులుగా వైరల్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఆ పాత్రలో సత్యరాజ్ కనిపించబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు బయటికి వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే.

అయితే ప్రస్తుతం వస్తున్న కథనాల ప్రకారం సత్యరాజ్ ఈ పాత్రలో నటించడం లేదు అని ,  ఆ పాత్రలో మలయాళ ఇండస్ట్రీ లో స్టార్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్న మోహన్ లాల్ కనిపించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. మోహన్ లాల్ కనక ఈ మూవీ లో నటించినట్లు అయితే  ఈ సినిమా క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది ఇలా ఉంటే ఇది వరకే మోహన్ లాల్ ,  జూనియర్ ఎన్టీఆర్ ,  కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన జనతా గ్యారేజ్ అనే తెలుగు మూవీ లో నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: