సహజీవనం తర్వాత పెళ్లి చేసుకుంటేనే బాగుంటుంది... అల్లు శిరీష్..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటు వంటి అల్లు శిరీష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ హీరో ఇప్పటికే అనేక మూవీ లలో నటించి తనకంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. అల్లు శిరీష్ కెరియర్ లో  శ్రీరస్తు శుభమస్తు మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తో అల్లు శిరీష్ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు లభించింది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ యువ హీరో ఊర్వశివో రాక్షసివో అనే రొమాంటిక్ , లవ్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ కి రాకేష్ శశి దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ నవంబర్ 4 వ తేదీన ఈ మూవీ థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ రావడంతో ,  ప్రస్తుతం ఈ మూవీ విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది. ఈ మూవీ కి ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ రావడంతో ఈ మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే బ్లాక్ బాస్టర్ ఈవెంట్ ను కూడా ఏర్పాటు చేసింది. ఈవెంట్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఇది ఇలా ఉంటే తాజాగా అల్లు శిరీష్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు.

తాజాగా అల్లు శిరీష్ మాట్లాడుతూ ... ఊర్వశివో రాక్షసివో మూవీ లోని ముద్దు దృశ్యాలు సెన్స్ తో తెరకెక్కించాము అని ,  ఎక్కడా కూడా హద్దులు దాటలేదు అని అల్లు శిరీష్ చెప్పుకొచ్చాడు. అలాగే ఈ మూవీ లో ప్రేమ ,  సహజీవనం ,  పెళ్లి అంశాలను చర్చించామన్నాడు. వివాహ వ్యవస్థ పై తనకు చాలా బలమైన విశ్వాసం ఉంది అని అల్లు శిరీష్ చెప్పాడు. అలాగే సహజీవనం తర్వాత పెళ్లాడితే బాగుంటుంది అనేది తన అభిప్రాయం అని చెప్పాడు. అలాగే తన పెళ్లి విషయంలో ఇంట్లో ఏ మాత్రం ఒత్తిడి చేయడం లేదు అని అల్లు శిరీష్ పేర్కొన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: