మరో అమ్మాయి వెంట పడుతున్న కార్తీక్ ఆర్యన్.. ఎవరో తెలిస్తే షాక్..!

Divya
దేశంలో అత్యంత ప్రజాదారణ పొందిన యువ నటులలో కార్తీక్ ఆర్యన్ కూడా ఒకరు. ఇటీవల భూల్ భూలయ్య 2 సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని క్రైసిస్ లోను హిట్ ఇచ్చిన హీరోగా రికార్డు లోకి ఎక్కారు. సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ఈయన భారీ ప్రాజెక్టులను కూడా దక్కించుకున్న తీరు చూస్తే ఎంతటి ఆదరణ ఉందో మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా అందాల హీరోయిన్స్ లో ఇతడికి అసాధారణ ఫాలోయింగ్ కూడా ఏర్పడింది. కార్తీక్ ఇటీవల డేటింగ్ రూమర్లతో బాగా వైరల్ అవుతున్నాడు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం .. హృతిక్ రోషన్ మొదటి కజిన్ పప్మీనా రోషన్ తో కార్తీక్ డేటింగ్ చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈమె ప్రముఖ సంగీత దర్శకురాలు..ఈమె రాజేష్ రోషన్ కుమార్తె.
కార్తిక్ ఆర్యన్ గతంలో సారా అలీ ఖాన్,  జాన్వి కపూర్ లాంటి కొత్త హీరోయిన్లతో ప్రేమాయణం సాగించిన విషయం తెలిసిందే. కానీ దానిన అతడు ఖండించాడు.  తమ మధ్య ఉన్నది స్నేహం మాత్రమేనని తెలిపాడు.  తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రోషన్ల వంశంలో అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాడని టాక్ కూడా ఇప్పుడు బాగా హీటెక్కిస్తోంది. ప్రేమ కథ చిత్రాలలో ఆషికి , ఆషికి 2 తో యువతరాన్ని ఒక ఊపు ఊపిన విషయం తెలిసిందే.  ప్రస్తుతం ఆశిఖి 3 చిత్రీకరణ కూడా రంగం సిద్ధమవుతోంది. ఇందులో కార్తీక్ ఆర్యన్  హీరోగా నటిస్తున్నారు. అయితే హీరోయిన్ ను ఇంకా ఫైనల్ చేయలేదు.

ఇందులోనే కార్తీక్ ఆర్యన్ రష్మిక మందన్న ప్రముఖ స్కిన్ కేర్ ఉత్పత్తి ప్రకటనలో కూడా నటించారు. అయితే టాలెంటెడ్ హీరోతో రష్మిక మందన్నకు ఇది మొదటి అవకాశం కావడం గమనార్హం. ఒకవేళ అన్నీ కుదిరితే ఆశిఖి 3 లో రష్మిక హీరోయిన్గా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈయన ప్రేమ వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: