అర్చన లవ్ బ్రేకప్ కి ఆమె కారణమా..?

Divya
నిరీక్షణ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటి అర్చన. ఈమె నిరీక్షణ, దాసీ వంటి సినిమాలతో ఉత్తమ నటిగా అవార్డు కూడా సొంతం చేసుకుంది. ప్రజల మనసులో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న అర్చన చేసింది కొన్ని సినిమాలు అయినా ఎక్కువగా గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా నిరీక్షణ సినిమాలో భానుచందర్ సరసన జాకెట్ లేకుండా నటించి సౌత్ లో ఏ హీరోయిన్ కూడా చేయని సాహసాన్ని చేసిందని చెప్పాలి . దీంతో ఈమె బాగా పాపులర్ అయింది.. దర్శకుడు బాలు మహేంద్ర నల్ల కలువల లాంటి అనేకమంది హీరోయిన్స్ ను పరిచయం చేసిన సంగతి మనకు తెలిసిందే. అప్పుడే అవకాశాల వేటలో ఉన్న అర్చనకు కూడా బాలు మహేంద్ర నిరీక్షణ సినిమాలో అవకాశం ఇచ్చారు.
తెలుగు సినిమా రంగంలో తొలుత హీరోయిన్గా రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత తెలుగు, తమిళ్, మలయాళం,  కన్నడ రంగాల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించింది.  ఆమె అసలు పేరు సుధా సినిమాల కోసం రంగాగా పేరు మార్చుకుంది. తెలుగులో లేడీస్ టైలర్స్ సినిమాతో కామెడీ చిత్రంలో కూడా నటించిన అర్చన.. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ సరసన హీరోయిన్ గా నటించింది. ఇదిలా  ఉండగా ఆమె వైవాహిక జీవితంలో ఎన్నో కష్టాలు పడినట్లు తెలుస్తోంది ..ఆమెకు గురువుగా ఉన్న బాలు మహేంద్ర తోనే ప్రేమలో పడింది అర్చన.  అయితే అప్పటికే బాలు మహేంద్ర జీవితంలో చాలా మంది ఉన్నారు.  పెళ్లి అయి ఒక కొడుకు ఉన్న బాలు మహేంద్ర హీరోయిన్ శోభను ప్రేమించి రెండవ వివాహం చేసుకున్నాడు . కానీ ఆమె 18 ఏళ్ల వయసులోనే ఆత్మహత్య చేసుకుని మరణించింది.
ఆ తర్వాత హీరోయిన్ అర్చన ప్రేమలో పడిన బాలు మహేంద్ర ఆయన సినిమాల ద్వారా వచ్చిన మరొక హీరోయిన్ మౌనికను కూడా ప్రేమించాడు.  మౌనిక కూడా బాలు మహేంద్రను చాలా ఇష్టంగా ప్రేమించి తన వైపు తిప్పుకుంది.  ఇక మౌనిక వల్లే బాలు మహేంద్ర అర్చనకు దూరమయ్యాడని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: