దేశం గర్వపడే నటుడు విశ్వనటుడు కమల్‌హాసన్ హీరోగా రూపొందుతున్న తాజా సినిమా 'ఇండియన్ 2'. ఈ సినిమాకి సౌతిండియా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. 1996లో వీరి కాంబినేషన్లో వచ్చి ఇండస్ట్రీ హిట్ అయిన 'ఇండియన్' (తెలుగులో 'భారతీయుడు') సినిమాకు ఇది సీక్వెల్.ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు.ఇక సోమవారం నాడు కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా క్రేజీ అప్ డేట్‌తో ముందుకొచ్చింది చిత్రబృందం. ఈ సినిమాలోని కమల్ హాసన్ పోస్టర్‌ను టీం రిలీజ్ చేసింది.మూవీ టీం రిలీజ్ చేసిన కమల్ హాసన్ తాజా పోస్టర్ సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతూ నెట్టింట తెగ వైరలవుతోంది. ఈ పోస్టర్లో కమల్ హాసన్ వృద్ధుడి గెటప్ అభిమానులను చాలా విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈమధ్యనే తిరుపతిలో కొన్ని కీలకమైన సీన్లు కూడా తెరకెక్కించారు.
ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్‌సింత్ ఇంకా అలాగే బాబీ సింహా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇంకా అలాగే ఈ మూవీలో భారత దేశ మాజీ క్రికెటర్ అయిన యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్ కీలకపాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఇక చాలా కాలం తర్వాత ఇటీవల విక్రమ్ సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు కమల్ హాసన్ . డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ మూవీలో విజయ్ సేతుపతి, సూర్య ఇంకా అలాగే ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలలో నటిస్తున్నారు.యువ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది చాలా గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్ లో కనీ విని ఎరుగని రీతిలో విడుదల కానుంది.ఇక ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధిస్తుందో చూడాలి.