కాంతార: ఇప్పటికీ అదే జోరు?

Purushottham Vinay
కన్నడలో సెప్టెంబర్ నెల చివర్లో విడుదల అయిన 'కాంతార' చిత్రం… అక్టోబర్ 15న తెలుగుతో పాటు మిగతా భాషల్లో కూడా రిలీజ్ అయ్యింది. కన్నడ డైరెక్టర్ రిషబ్ శెట్టి నటించి, డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో 'గీతా ఆర్ట్స్' సంస్థ రిలీజ్ చేసింది. మొదటి రోజే ఈ మూవీ ఊహించని రేంజ్ లో అంచనాలను తలకిందులు చేస్తూ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుని చాలా ఈజీగా బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇంకా ఆ జోరు ఇప్పటికీ తగ్గలేదు అనే చెప్పాలి. ఇక మూడో వారంలోకి ఎంటర్ అయినా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ సూపర్ స్ట్రాంగ్ గా వసూలు చేస్తుంది.ఇక 4 వ వారంలోకి ఎంటర్ అయినప్పటికీ ఈ మూవీ దూకుడు అసలు ఎక్కడా కూడా తగ్గలేదు అనే చెప్పాలి. మన తెలుగు సినిమాలే బాక్సాఫీస్ వద్ద 3 వ వారం వరకు పెర్ఫార్మ్ చేయలేకపోతుంటే.. కేవలం ఒక డబ్బింగ్ సినిమా 4 వ వారంలోకి ఎంటర్ అయి ఇలా వసూళ్లను కుమ్ముతుండడం మామూలు విషయం కాదు.


ఒకసారి ఈ సినిమా 23 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే..ఈ 'కాంతార' చిత్రానికి టోటల్ గా తెలుగులో రూ.1.65 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అయితే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.ఇక మొదటి రోజే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ మూవీ 23 రోజులు పూర్తయ్యేసరికి టోటల్ గా రూ.25.55 కోట్ల షేర్ ను రాబట్టింది. దీంతో బయ్యర్స్ కు ఏకంగా రూ.22.70 కోట్ల భారీ లాభాలను అందించింది.అసలు నిన్న కూడా ఈ మూవీ ఏకంగా రూ.0.80 కోట్ల పైనే షేర్ ను అందించింది. కొత్త సినిమాలు ఊర్వశివో రాక్షసివో, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వంటి చిత్రాలు ఉన్నప్పటికీ ఈ రేంజ్ లో కలెక్ట్ చేయడం అంటే అసలు మామూలు విషయం కాదు అనే చెప్పాలి.ఇక టోటల్ గా 310 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా యూ ఎస్ లో ఏకంగా 2 మిలియన్ డాలర్ల పైగా వసూళ్లు సాధించి సూపర్ డూపర్ రికార్డ్ సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: