మెగాస్టార్ రిజెక్ట్ చేసిన కథతో నితిన్ సినిమా..?

Anilkumar
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లి తర్వాత అవి తనకు కలిసి రావని తెలుసుకుని తిరిగి సినీ రంగ ప్రవేశం చేశారు.సినీ రంగ ప్రవేశం చేసిన తర్వాత ఆయన హీరోగా నటించిన ఖైదీ నెంబర్ 150 అనే సినిమాతో హిట్టు అందుకున్నారు.ఇక  ఆ తర్వాత ఆయన చేసిన సైరా నరసింహారెడ్డి, ఆచార్య వంటి సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. అయితే ఆచార్య అయితే పూర్తిస్థాయిలో డిజాస్టర్ టాక్ తెచ్చుకుని మెగా అభిమానులకు తలనొప్పిగా మారింది.ఇక ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్టు టాక్ తెచ్చుకున్నారు.  

కలెక్షన్స్ విషయంలో మాత్రం పూర్తి స్థాయిలో సినిమా వర్కౌట్ అవ్వలేదని చెప్పాలి.ఇక  దీంతో ఆయన ఒప్పుకున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు వహిస్తున్నారు.అయితే  ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ డైరెక్షన్ లో వాల్తేరు వీరయ్య అనే సినిమా రూపొందింది.ఇకపోతే  దాదాపుగా షూట్ పూర్తి కావస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది.ఇదిలా ఉంటె మరోపక్క ఆయన భోళా శంకర్ అనే సినిమా కూడా చేస్తున్నారు.ఇక  తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన వేదాళం అనే సినిమాని తెలుగులో మెహర్ రమేష్ డైరెక్టర్ గా రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమాలతో పాటు వెంకీ కుడుముల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమా అనౌన్స్ చేశారు.ఇక  అన్నీ బాగుండి ఉంటే ఈ సినిమాని ఆర్ఆర్ఆర్ నిర్మాత డివివి దానయ్య నిర్మించాల్సి ఉంది.

 ఈ సినిమా తనకు అంతగా వర్క్ అవుట్ కాకపోవచ్చు అని మెగాస్టార్ చిరంజీవి భావిస్తున్నారట.అయితే ఇదే విషయాన్ని వెంకీ కుడుముల దృష్టికి తీసుకు వెళ్లడంతో కథలో ఏదైనా మార్పులు చేర్పులు చేయాలని ఆయన అడగడంతో కథలో మార్పులు చేర్పులు చేసినా అది పూర్తిస్థాయిలో కథను ఇబ్బంది పెట్టడమే తప్ప తనకు వర్కౌట్ అయ్యే అవకాశం కనిపించడం లేదని మెగాస్టార్ పేర్కొన్నారట. ఇక ఈ నేపథ్యంలోనే ఈ సినిమాని మెగాస్టార్ చిరంజీవి వద్దనుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదే కథను వెంకీ కుటుంబంలో గతంలో భీష్మ సినిమా చేసిన నితిన్ దగ్గరకు తీసుకెళ్లడంతో నితిన్ ఆ కథ విని వెంటనే సినిమా చేసేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.ఇక  మెగాస్టార్ చిరంజీవి చరిష్మాకు ఈ కథ సూట్ కాకపోవచ్చని నితిన్ కి సూట్ కావచ్చు అని అంటున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే నితిన్ ఈ సినిమా ఒప్పుకోవడం ఆసక్తికరంగా మారింది.ఇక  ఈ సినిమాని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: