అల్లు అరవింద్ కు కలసిరాని కాంతార !

Seetha Sailaja
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో నలుగురు కలిస్తే చాల ‘కాంతార’ మూవీ గురించి మాట్లాడుకుంటున్నారు. ఒకప్పుడు జనం ‘బాహుబలి’ చూసారా అని అడిగినట్లుగా ఇప్పుడు ‘కాంతార’ చూసారా అని ఒకరినొకరు అడగడం చూస్తుంటే ఈమ్యానియా తెలుగు రాష్ట్రాలను ఏవిధంగా టార్గెట్ చేసిందో అర్థం అవుతుంది.

ఈమూవీ విడుదలై మూడు వారాలు అవుతున్నప్పటికీ ఇంకా ఈసినిమా కలక్షన్స్ చాల బాగా ఉన్నాయి అన్నవార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీ ఇప్పటికే 44 కోట్ల కలక్షన్స్ వసూలు చేసిందని ఈమూవీ 50 కోట్ల మార్క్ ను అందుకోవడం ఖాయం అన్నఅంచనాలు వస్తున్నాయి. వాస్తవానికి ఈ మూవీని డబ్ చేసింది అల్లు అరవింద్ కాబట్టి ఈమూవీతో అరవింద్ కు కొట్లల్లో లాభాలు వచ్చి ఉంటాయి అని అనుకున్నారు అంతా.

అయితే అసలు జరిగింది వేరు అన్నప్రచారం జరుగుతోంది. ‘కాంతార’ మూవీని అరవింద్ తెలుగు డబ్బింగ్ రైట్స్ పూర్తిగా తీసుకుని ఆమూవీని విడుదల చేయాలని భావించారట. అప్పటికే ఇలాంటి కథలతో ‘రంగస్థలం’ ‘పుష్ప’ లాంటి సినిమాలు విడుదలై బ్లాక్ బష్టర్ హిట్ కావడంతో అరవింద్ ఆలోచనలు మారి ఈమూవీ డబ్బింగ్ రైట్స్ పూర్తిగా తీసుకోకుండా ఈమూవీని తెలుగులో పర్సెంటేజ్ పద్ధతి పై విడుదల చేసారట.

దీనితో ఈమూవీ కలక్షన్స్ వల్ల అరవింద్ కు వచ్చే లాభం తక్కువగా ఉంటుందని ఈమూవీ కలక్షన్స్ అన్నీ ఈమూవీ ఒరిజనల్ నిర్మాతలు హోంబలే ఫిల్మ్స్ వారికి వెళ్ళిపోతాయి అన్న గుసగుసలు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్నాయి. ఒక సినిమాను చూసి కూడ ఎంతో అనుభవం ఉన్న అరవింద్ లాంటి వాళ్ళు కూడ ఏసినిమా హిట్ మరే సినిమా ఫట్ అన్నవిషయం తెలుసుకోలేకపోతున్నారు అంటే సగటు ప్రేక్షకుడి నాడి ఎవరికీ అంతుపట్టడం లేదన్నది నిజం. అందుకే సినిమాల ఫలితం అదేవిధంగా ఎన్నికల ఫలితం తలలు పండినారు కూడ నేడు అంతుపట్టడం లేదు. అందువల్లనే ఈ రెండు రంగాలలో విజయం సాధించేవారు కేవలం కొంతమంది మాత్రమే ఉంటారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: