డేటింగ్ రూమర్లపై.. క్లారిటీ ఇచ్చిన జాన్వీ కపూర్..!!

Divya
దివంగత నటి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వి కపూర్ ప్రస్తుతం బాలీవుడ్లో పలు సినిమాలలో నటిస్తూ చాలా బిజీగా ఉంది. జాన్వీ కపూర్ నటించిన మీలి చిత్రం థియేటర్లో విడుదల కాగా మంచి విజయ దిశగా దూసుకుపోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం మలయాళం లో మంచి విజయాన్ని అందుకున్న హెలెన్ సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేశారు. జాన్వీ కపూర్ డేటింగ్ పైన తరచు పలు రూమర్లు వినిపిస్తూనే ఉంటాయి అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు తనపై వస్తున్న ఈ వార్తలపై స్పందించడం జరిగింది.

జాన్వీ కపూర్ మాట్లాడుతూ అతను నాకు చాలా కాలంగా తెలుసు..అతను నా వెంట ఉన్నప్పుడు చాలా ధైర్యంగా ఉంటుంది. అతడి లాంటి స్నేహితుడు దొరకడం నాకు చాలా అదృష్టం. ప్రతి విషయంలో కూడా తనకు మద్దతుగా నిలుస్తూ ఉంటాడు నేను అతనిని చాలా నమ్ముతా.. అతను ఒక గొప్ప వ్యక్తి  అని జాన్వి తెలియజేసింది. జాన్వి కపూర్, ఓర్హాన్ లు తరచూ పలు విహారయాత్రలకు తిరుగుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో హలో విన్ సందర్భంగా ఓర్హాన్ ఒక పార్టీ నిర్వహించగా అందుకు జాన్వి కూడా హాజరైనట్లు తెలుస్తోంది. ఇక అంతకుముందే దీపావళి పండుగను పురస్కరించుకొని వీరిద్దరూ కలిసి పలు పార్టీలకు కూడా హాజరయ్యారు.
ఓర్హాన్ ,జాన్వి తో ఉన్న చిత్రాలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటారు. అయితే కేవలం ఆమె మేమిద్దరమూ మంచి స్నేహితులమనే విషయాన్ని తెలియజేసింది జాన్వి కపూర్. ఇక టాలీవుడ్ లో ఈమె ఎంట్రీ కోసం అభిమానులకు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఈ మధ్యకాలంలో ఎన్టీఆర్ 30వ సినిమాకి ఈ ముద్దుగుమ్మ హీరోయిన్గా ఎంపిక అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి తన తల్లి కోరిక మేరకు ఎన్టీఆర్తో నటించి మంచి విజయాన్ని అందుకొని ఇక్కడ కూడా స్టార్ హీరోయిన్గా పేరు సంపాదిస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: