త్వరలో ఓటీటీలో ప్రసారం కానున్న ఊర్వశివో రాక్షసివో..!

Divya
ఎట్టకేలకు అల్లు శిరీష్ ఖాతాలో ఒక సక్సెస్ చేరుకుందని చెప్పవచ్చు.. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఊర్వశివో రాక్షసివో సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుందని చెప్పాలి. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత అల్లు శిరీష్ హీరోగా నటించిన ఈ సినిమా నవంబర్ 4వ తేదీన థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో రొమాంటిక్, కామెడీ సన్నివేశాలు యువతను బాగా ఆకట్టుకున్నాయి. ఇకపోతే ఈ సినిమా థియేటర్లలో సక్సెస్ఫుల్గా రన్ అవుతుందని చెప్పవచ్చు. ఈ సినిమాకు సంబంధించి డిజిటల్ మీడియా పార్ట్నర్ గురించి కూడా ఒక వార్త చెక్కర్లు కొడుతుంది. త్వరలోనే అందులోనే స్ట్రీమింగ్ కాబోతోంది అంటూ కూడా వార్తలు వినిపిస్తూ ఉండడం గమనార్హం.

ఈ సినిమా డిజిటల్ హక్కులను రెండు ఓటీటీ సంస్థలు కొనుగోలు చేసినట్లు సమాచారం.  తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా తో పాటు నెట్ ఫ్లిక్స్ సైతం ఈ సినిమా డిజిటల్ హక్కులను ఫ్యాన్సీ ధరలకు కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సినిమా నిబంధనల ప్రకారం 8 వారాలపాటు ప్రదర్శన ముగిసిన తర్వాత ఈ సినిమాని డిజిటల్ మీడియాలో ప్రసారం చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమా నవంబర్ 4వ తేదీన థియేటర్లలో విడుదలైంది. కాబట్టి డిసెంబర్ ఆఖరి వారంలో ఈ సినిమా డిజిటల్ మీడియాలో ప్రసారం కాబోతున్నట్లు తెలుస్తోంది.ఇకపోతే త్వరలోనే ఈ సినిమా డిజిటల్ హక్కుల గురించి అలాగే డిజిటల్ స్ట్రీమింగ్ గురించి కూడా అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇక ఈ సినిమాలో అల్లు శిరీష్ సరసన అను ఇమ్మానుయేల్ నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ పిక్చర్స్ బ్యానర్ పై ధీరజ్ మొగిలినేని ఈ చిత్రాన్ని నిర్మించారు . ఈ సినిమా తమిళ చిత్రం ప్యార్  ప్రేమ కాదల్ ఆధారంగా రూపొందించారు.  ఇలా తెలుగులో ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో అల్లు శిరీష్ కి ఇకపై అవకాశాలు వస్తాయంటూ కూడా కామెంట్ వినిపిస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: