బిగ్ బాస్ షో లో నిజాలు బయట పెట్టండి..నెటిజన్లు ఫైర్..

Satvika
బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు..గత ఐదు సీజన్ల తో పోలిస్తే ఈ సీజన్ కాస్త గొడవల మధ్య జరుగుతుంది..ఇప్పటికే మెయిన్ మెంబర్స్ ఇంటి నుంచి బయటకు వచ్చారు..అయితే బయటకు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ట్రోల్స్ చేస్తున్నారు...ఈ షోకు ముగ్గురూ హోస్ట్ లు మారారు.స్టార్ హీరోలలో ఒకరైన నాగార్జున బిగ్ బాస్ షో సీజన్3 నుంచి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. నాగ్ హోస్ట్ అయిన తర్వాత ఈ షోకు మంచి రేటింగ్స్ రావడంతో నాగార్జున హోస్టింగ్ ను చాలామంది ప్రశంసించారు.



అయితే బిగ్ బాస్ షో సీజన్6 సమయంలో మాత్రం నాగార్జున హోస్టింగ్ పై పాజిటివ్ కామెంట్ల కంటే నెగిటివ్ కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. నాగార్జునకు బిగ్ బాస్ షోలో నిజాన్ని చెప్పే దమ్ము లేదా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.బిగ్ బాస్ హౌస్ లో నాగార్జున కొంతమంది సరిగ్గా ఆడని కంటెస్టెంట్లను సపోర్ట్ చేస్తున్నారని అదే సమయంలో బాగా ఆడేవాళ్లపై విమర్శలు చేస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. నాగార్జునకు బిగ్ బాస్ షోలో నిజాలను చెప్పే దమ్ము లేదా అంటూ మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.



మరోవైపు బిగ్ బాస్ షో ఎలిమినేషన్స్ పై కొంతమంది నెగిటివ్ కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి గలాటా గీతూ ఎలిమేట్ అయ్యారని తెలుస్తోంది. కొన్ని విషయాల్లో గలాటా గీతూను తప్పు పట్టినా ఆమె బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిపోతే ప్రస్తుతం ఈ షోకు వస్తున్న రేంజ్ లో రేటింగ్స్ రావడం కష్టమేనని కామెంట్లు వినిపిస్తున్నాయి. గలాటా గీతూ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిందని తెలిసి ఆమె అభిమానులు తెగ ఫీలవుతున్నారు. గలాటా గీతూ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా రచ్చరచ్చ చేసే ఛాన్స్ అయితే ఉంది. తన ఎలిమినేషన్ గురించి గీతూ ఎలా స్పందిస్తారో చూడాలి. మరోవైపు ఈ సీజన్ విన్నర్ ఎవరనే ప్రశ్నకు జవాబు దొరకడం లేదు. బిగ్ బాస్ షో విజేతగా ఏ కంటెస్టెంట్ గెలుస్తారో చూడాల్సి ఉంది..ఏది ఏమైనా ఈ షోకు విమర్శలు కూడా ఎక్కువగానే వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: