కాంతార: వామ్మో 300 కోట్లు దాటేసిందిగా?

Purushottham Vinay
కాంతార సినిమా ఎంత పెద్ద హిట్  అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేశావ్యాప్తంగా కూడా ఈ సినిమా ఎన్నో రికార్డులు సృష్టించింది. ఈ సినిమా హీరో కమ్ డైరెక్టర్ అయిన రిషబ్ శెట్టి యూనిక్ స్టొరీ పాయింట్ ని కంప్లీట్ రా రగ్గుడ్ నేపధ్యంలో తెరకిక్కించగా తన పెర్ఫార్మెన్స్ టాప్ నాట్చ్ అనిపించే విధంగా ఉండగా మిగిలిన యాక్టర్స్ అందరూ ఆకట్టుకున్నారు, సినిమా మొదటి పావుగంట అలాగే చివరి 30 నిమిషాలు ఆడియన్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఈ చిత్రానికి అయితే హోంబలే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించగా తెలుగులో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రం రిలీజ్ చేశారు. ఈ సినిమా 21 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయానికొస్తే.. తెలంగాణ (నైజాం)లో రూ. 11.45కోట్లు షేర్ రాయలసీమ (సీడెడ్)లో రూ. 2.81 కోట్లు షేర్, ఉత్తరాంధ్ర రూ. 3.11 కోట్లు.. ఈస్ట్ గోదావరి - రూ. 1.82కోట్లు.. వెస్ట్ గోదావరి - రూ. 1.14 కోట్లు గుంటూరు - రూ. 1.50కోట్లు కృష్ణా - రూ. 1.46 కోట్లు.. నెల్లూరు రూ. 0.86 కోట్లు.. మొత్తంగా తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ కలిపి ఈ చిత్రం 3 వారాలకు గాను రూ.24. 17 కోట్లు షేర్ (రూ. 43.85కోట్ల గ్రాస్ వసూళ్లు) రాబట్టింది.


తెలుగులో కాంతార రూ. 2 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇప్పటి 2.30 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 24.17 కోట్ల షేర్ (రూ. 43.85 కోట్ల గ్రాస్ ) రాబట్టింది. మొత్తంగా రూ. 21.87 కోట్ల లాభాలను ఆర్జించింది. అంటే పెట్టిన పెట్టుబడికి నాలుగింతలు లాభాలను తీసుకొచ్చింది. ఓవరాల్‌గా ఈ చిత్రం సంచనాలు మాత్రం ఆగడం లేదు. ఇక హిందీలో ఈ చిత్రం ఇప్పటి వరకు రూ. 44 కోట్ల వరకు నెట్ వసూళ్లను రాబట్టి అక్కడ కూడా సత్తా చాటుతోంది. ఓవరాల్‌గా రూ. 310 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో సత్తా చూపెడుతుంది.నిజంగా ఇది ఒక సూపర్  డూపర్  రికార్డ్  అని చెప్పాలి. ఇంకా ఈ సినిమా థియేటర్ లలో చాలా విజయవంతంగా ఆడుతుంది. ఇంకా ఈ సినిమా మున్ముందు రోజుల్లో ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: