ఏంటి.. వంటలక్క మరీ ఇంత రిచ్చా?

praveen
వంటలక్క.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులందరికీ కూడా ఈ పేరు గురించి కానీ.. ఈ పాత్రలో నటించే నటి గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు అని చెప్పాలి. వంటలక్క పాత్ర ద్వారా ప్రేమీ విశ్వనాథన్ బుల్లితెర ప్రేక్షకులందరికీ దగ్గర అయింది. ప్రతి ఇంటి మనిషిలా మారిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మలయాళ ఇండస్ట్రీకి చెందిన ప్రేమీ విశ్వనాథ్ తెలుగులో కూడా కార్తీకదీపం సీరియల్ ద్వారా అభిమానులను సంపాదించుకుంది.. దాదాపు 5 ఏళ్ళ నుంచి ప్రసారమవుతున్న ఈ సీరియల్ ప్రేక్షకులను టీవీలకు అతుక్కుపోయేలా చేసింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 అయితే ఐదేళ్ల నుంచి కూడా కార్తీక దీపం సీరియల్ ప్రసారమవుతూ ఉండగా.. టాప్ రేటింగ్స్ సొంతం చేసుకుంటు.. బులితెరపై చరిత్ర సృష్టించింది.. అయితే గత కొంతకాలం నుంచి ప్రేమీ విశ్వనాథ్ కనిపించకపోవడంతో సీరియల్ రేటింగ్స్ దారుణంగా పడిపోయాయి. దీంతో కొత్త కథనాన్ని రాసుకొని మళ్లీ వంటలక్క పాత్రను సీరియల్ లోకి తీసుకువచ్చారు దర్శకులు. కాగా వంటలక్క పాత్ర పేరుతో ఎన్నో సినిమాలో కామెడీ ట్రాక్ లు కూడా ప్రేక్షకులను నవ్వించాయి అని చెప్పాలి..

 ఇకపోతే ఇటీవలే వంటలక్కకు సంబంధించిన ఒక విషయం కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. గతంలో ప్రేమీ విశ్వనాథ్ ఒక ఇంటర్వ్యూలో వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. కార్తీకదీపం సీరియల్ లో కష్టాలు పడుతూ బుల్లితెర ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించే వంటలక్క నిజ జీవితంలో మాత్రం ఎంతో ధనవంతురాలట. ఏకంగా కేరళలో ప్రేమీ విశ్వనాథ్ కి రెండు సొంత స్టూడియోలు కూడా ఉన్నాయట. ఈ స్టూడియోలలో పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ జరుగుతూ ఉంటాయట. ఈ విషయం తెలిసి బుల్లితెర ప్రేక్షకులు మా వంటలక్క ఇంత ధనవంతురాలా అని ఆశ్చర్యపోతున్నారు. ఇకపోతే ప్రేమి విశ్వనాధ్ తెలుగులో ఒక స్టార్ హీరో సినిమాలో  అవకాశం దక్కించుకున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: