అల్లువారబ్బాయి "బోల్డ్ కంటెంట్" తో హిట్ కొట్టాడుగా !

VAMSI
పేరుకు మెగా కాంపౌండ్ నుండి వచ్చిన హీరో అయినప్పటికీ అల్లు శిరీష్ కు అంతగా ఆదరణ దక్కలేదు. తన సినీ కారీర్ ను 2013 వ సంవత్సరంలో "గౌరవం" అనే చిత్రంతో ప్రారంభించాడు. కానీ తనకు ఇది ప్లస్ కాలేదు. ఆ తర్వాత వరుసగా "కొత్తజంట", "శ్రీరస్తు శుభమస్తు", 1971 , ఒక్క క్షణం, ఏబీసీడీ సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి వివిధ ప్రయత్నాలు చేశాడు. వీటిలో కొత్త జంట యావరేజ్ మూవీగా నిలవగా, శ్రీరస్తు శుభమస్తు ఒక మోస్తరు విజయాన్ని అందుకుంది. దానితో అల్లు శిరీష్ సినిమాలకు బాగా గ్యాప్ ఇచ్చాడు. దాదాపుగా మూడు సంవత్సరాలపాటు తన నుండి ఎటువంటి సినిమా రాకపోవడం విశేషం.
తాజాగా అల్లు శిరీష్ నుండి "ఊర్వశివో... రాక్షసివో..." సినిమా థియేటర్ లలో ఎన్నో అంచనాలతో గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈ సినిమా తన సొంత బ్యానర్ గీత ఆర్ట్స్ 2 లో నిర్మితమైంది..దర్శకుడు రాకేష్ శశి ఎలాగైనా అల్లు శిరీష్ కు హిట్ ను అందించాలన్న కసితో పనిచేశాడు. కన్నా ఈ సినిమా ఒక తమిళ మూవీకి రీమేక్ కావడం గమనార్హం. ఇందులో అల్లు శిరీష్ సరసన అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్ గా నటించింది. మిగిలిన పాత్రలలో వెన్నెల కిషోర్, అనీష్ కురువిల్లా, పోసాని కృష్ణమురళి, ఆమని మరియు కేదార్ శంకర్ లు నటించి మెప్పించారు. ఈ సినిమాకు ఉదయం నుడ్ని అటు ప్రేక్షకుల నుండి ఇటు సోషల్ మీడియా నుండి పాజిటివ్ రివ్యూ లు వస్తున్నాయి.
ఈ సినిమా కథ ఏమిటి అన్నది ఇప్పటికే వైరల్ గా మారిపోయింది. పైగా తమిళ సినిమా ఆల్రెడీ వచ్చింది... కాబట్టి పెద్దగా చెప్పుకునేది ఏమీ లేదు. ఇందులో శ్రీ గా అల్లు శిరీష్ అదరగొట్టాడు అని చెప్పాలి. ఇక అనూ ఇమ్మాన్యుయేల్ సైతం సింధు పాత్రలో అల్లు శిరీష్ పాత్రను కూడా ఓవర్ టేక్ చేసి వెళ్ళిపోతుంది. అయితే ఈ సినిమా గురించి కొన్ని విషయాలు ఇప్పటికే సోషల్ మీడియాలో రివ్యూలు రూపంలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో హీరో హీరోయిన్ లు పెళ్ళికి ముందే సహజీవనం చేసే సీన్ లను దర్శకుడు చక్కగా తెరకెక్కించాడు. సినిమా ఆద్యంతం హీరో హీరోయిన్ ల మధ్యన డబల్ మీనింగ్ డైలాగులు, లిప్ లాక్ లతో యువతను ఆకట్టుకునే ఫుల్ బోల్డ్ కంటెంట్ సినిమాలో ఉందట. ఈ సినిమా ఖచ్చితంగా యువతను ఆకట్టుకుని బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని తెలుస్తోంది. మొత్తానికి అల్లు శిరీష్ "ఊర్వశివో రాక్షసివో" అనే సినిమాతో హిట్ కొట్టాడు.  





 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: