కంటెస్టెంట్స్ కు కర్రలు ఇచ్చిన బిగ్ బాస్..చివరికి?

Satvika
బిగ్ బాస్ 6 ఇప్పుడు జనాల్లొ మంచి క్రేజ్ ను అందుకుంది.. ఆ షో కు విమర్శలు మొదలయ్యాయి.. అయిన వెనక్కి తగ్గకుండా రకరకాల టాస్క్ లతో పిచ్చేక్కిస్తున్నారు.. బిగ్‌బాస్ సీజన్ 6 రసవత్తరంగా సాగుతుంది. ఒక రెండు వారాల నుంచి కంటెస్టెంట్స్ మధ్య పోటీ విపరీతంగా సాగుతోంది. బిగ్‌బాస్ ఇచ్చే టాస్కులు కంటెస్టెంట్స్ మధ్య తీవ్ర గొడవలు పెడతాయన్న సంగతి తెలిసిందే..కొట్టుకోడానికి కూడా సిద్ధమవుతారు కంటెస్టెంట్స్. ఈ సారి బిగ్‌బాస్ ఏకంగా కర్రలు ఇచ్చి కొట్టుకునే టాస్క్ ఇచ్చాడు. ఇంకేముంది కంటెస్టెంట్స్ మధ్య పోటీ రచ్చ రచ్చగా మారింది.

బిగ్‌బాస్ ఇచ్చిన ఓ టాస్కులో ఇంటి సభ్యులను రెడ్ టీం అండ్ బ్లూ టీంగా విడగొట్టారు. ఈ టాస్క్ లో భాగంగా రెడ్ టీం వాళ్ళు ముగ్గురు, బ్లూ టీం వాళ్ళు ముగ్గురు ఎదురెదురుగా గోడల మీద నిలబడతారు. వీరికి కర్రలు ఇస్తే ఆ కర్రలతో కొట్టుకుంటూ అవతలి వాళ్ళని గోడ మీద నుంచి పడేయాలి. రెడ్ టీం నుంచి రేవంత్, ఫైమా, శ్రీహన్ బరిలోకి దిగగా బ్లూ టీం నుంచి మెరీనా, వాసంతి, ఇనయాలు దిగారు. ఈ గేమ్ లో భాగంగా ఇనయ, శ్రీహాన్ మధ్య గొడవ గట్టిగానే జరిగింది. ముందు నుంచి వీరిద్దరి మధ్య ఉన్న వివాదం అందరికి తెలిసిందే. ఇక ఈ టాస్కులో మాటలతో రెచ్చిపోయి కర్రలతో కొట్టుకుంటూ తెగ గొడవపడ్డారు..

శ్రీసత్య కూడా ఇనయాతో గొడవ పడింది. శ్రీసత్య, శ్రీహాన్ కలిసి ఇనయాని ఆడేసుకున్నారు. ఇక బాలాదిత్య లైటర్ గీతూ దొంగతనం చేయడంతో బాలాదిత్య, గీతూ మధ్య గొడవ అయింది. సిగరెట్ తాగితే తప్పా? నీకెందుకు ? అంటూ బాలాదిత్య ఎమోషనల్ కూడా అయ్యాడు. ఇక గీతూ గురించి తెలిసిందేగా ఎవరేమన్నా తన ఇష్టం వచ్చినట్టు ఎవరి మాట వినకుండా వెళ్ళిపోతుంది. బాలాదిత్య గొడవ పెట్టుకుంటే అవును నేనే తీశాను, ఏం చేసుకుంటావో చేసుకో అంటూ రెచ్చిపోయింది గీతూ..ఆదిరెడ్డికి ఒక సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. బాత్ రూమ్ ని డర్టీగా మార్చి రెడ్ టీం సభ్యులలో ఒకరిపై నింద వేయాలని, కావాలంటే మీ గ్రూప్ వాళ్ళ సాయం తీసుకోవచ్చని బిగ్‌బాస్ చెప్పాడు..ఈ టాస్క్ ను అతడు ఎలా చేస్తాడో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: