సమంత "యశోద" మూవీ రన్ టైమ్ లాక్..?

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతున్న సమంత గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సమంత తాజాగా యశోద అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లేడీ ఓరియంటెడ్ మూవీ గా తెరకెక్కింది. ఈ మూవీ కి హరి శంకర్ , హరీష్ నారాయణ్ దర్శకత్వం వహించగా , మణిశర్మ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ లో ఉండి ముకుందన్ , వరలక్ష్మి శరత్ కుమార్ , రావు రమేష్ ,  మురళీ శర్మ ముఖ్య పాత్రలలో నటించగా , శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్  ఈ మూవీ ని నిర్మించాడు.

ఈ మూవీ ని నవంబర్ 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేసింది. యశోద మూవీ యూనిట్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు పెట్టుకున్నారు.

ఈ మూవీ ని తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ ,  హిందీ భాషల్లో నవంబర్ 11 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది. సెన్సార్ బోర్డు నుండి యశోద మూవీ కి యు / ఏ సర్టిఫికెట్ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా యశోద మూవీ యూనిట్ ఈ సినిమా రన్ టైమ్ ను కూడా లాక్ చేసినట్లు తెలుస్తోంది. యశోద మూవీ 135 నిమిషాల నిడివి తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: