చిరంజీవితో చిందులేయబోతున్న మాజీ మిస్ యూనివర్స్..!!

Divya
చిరంజీవి, రవితేజ కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ చిత్రాన్ని డైరెక్టర్ బాబి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాని విడుదల చేయాలని చిత్ర బృందం ఈ సినిమా షూటింగ్ని శరవేగంగా చేస్తూ ఉన్నారు. ఇక ఇటీవల హైదరాబాదులో అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ఒక భారీ సెట్ లో స్పెషల్ సాంగ్ కూడా చిత్రీకరించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవి మరియు రవితేజ పాల్గొన్న ఈ పాట సినిమాలో ప్రత్యేక ఆకర్షణీయంగా నిలుస్తోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా ఐటెం సాంగ్ లో మాజీ మిస్ యూనివర్స్ ఊర్వశి రౌతెలా నటించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక తెలుగులో బ్లాక్ రోజు అనే చిత్రంతో హీరోయిన్గా నటించిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల హీరో రామ్ పోతినేని సినిమాలో కూడా స్పెషల్ సాంగులు చేసిన సంగతి తెలిసింది ఇప్పుడు తాజాగా వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా ఈ ముద్దుగుమ్మ ఐటెం సాంగ్ లో నటించబోతున్నట్లు సమాచారం. ఐటెం సాంగ్స్ ఇవ్వడంలో స్పెషల్ అయిన దేవిశ్రీప్రసాద్ ఇప్పుడు వాల్తేరు వీరయ్య సినిమా కోసం ఒక సరికొత్త ట్యూన్ ని కంపోజ్ చేసినట్లుగా సమాచారం. గతంలో చిరంజీవి మరియు రవితేజ సినిమాలకు దేవిశ్రీప్రసాద్ స్పెషల్ సాంగులను బాగా ఆకట్టుకున్నాయని చెప్పవచ్చు.
చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమా తర్వాత చిరంజీవి చేసిన స్పెషల్ సాంగ్ ఇదే అని చెప్పవచ్చు. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. మరి ఊర్వశి రోజు ఎలా చేసిన ఈ ఐటెం సాంగ్ మాస్ ఆడియన్స్ ఉంటుందని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాల హీరోయిన్గా శృతిహాసన్ కూడా నటిస్తున్నది . రవితేజ కు జోడిగా మాత్రం కేథరిన్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా మొత్తం వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇక ఇటీవలే టైటిల్ సినిమా టీజర్ విడుదల అవ్వగా ప్రేక్షకుల నుంచి మధ్య స్పందన లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: